IBPS RRB 2022 : నోటిఫికేషన్ విడుదల! భారీగా ఉద్యోగాలు!

Purushottham Vinay
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(IBPS) RRB 2022 నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఆర్ఆర్బీ గ్రూప్ A ఆఫీసర్ స్కేల్ I, II, III ఇంకా గ్రూప్ B ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీపర్పస్) నోటిఫికేషన్ ను సోమవారం నాడు అధికారిక వెబ్‌సైట్‌లో విడుదల చేసింది.ఇక ఈ నోటిఫికేషన్ ప్రకారం IBPS RRB దరఖాస్తు ఫారమ్ జూన్ 7 నుంచి 27వ తేదీ వరకు కూడా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది.ఇక మొత్తం ఉద్యోగాల వివరాల విషయానికి వస్తే..8081 ఉద్యోగాలకు నేటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మొదలైంది.దీని అధికారిక వెబ్‌సైట్: www.ibps.in.

ఇక IBPS RRB 2022 ఖాళీల వివరాలు

IBPS RRB ఆఫీస్ అసిస్టెంట్- మొత్తం 4483 ఖాళీలు
IBPS RRB ఆఫీసర్ స్కేల్- I- మొత్తం 2676 ఖాళీలు
IBPS RRB ఆఫీసర్ స్కేల్- II-మొత్తం 842 ఖాళీలు
IBPS RRB ఆఫీసర్ స్కేల్- III- మొత్తం 80 ఖాళీలు
IBPS అధికారిక వెబ్‌సైట్‌లో అర్హత ప్రమాణాలు, పరీక్ష విధానం ఇంకా అలాగే దరఖాస్తు ప్రక్రియకు సంబంధించిన పూర్తి నోటిఫికేషన్‌ను అందుబాటులో ఉంచింది.అలాగే CRP RRB - XI కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే దరఖాస్తుదారులు IBPS వెబ్‌సైట్‌లో పేర్కొన్న విధంగా నిర్ణీత తేదీలోపు కనీస అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ఖచ్చితంగా చూసుకోవాలి.

IBPS RRB 2022 ముఖ్య తేదీల విషయానికి వస్తే..

IBPS RRB రిజిస్ట్రేషన్ ఇంకా ఎడిట్ అలాగే మోడిఫికేషన్ గడువు --- జూన్ 7 నుంచి జూన్ 27, 2022 వరకు

దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన తేదీలు వచ్చేసి --- జూన్ 7 నుంచి 27, 2022 వరకు

ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ వచ్చేసి --- జులై 18 నుంచి 23, 2022

అలాగే IBPS RRB ప్రిలిమ్స్ పరీక్ష --- ఆగస్టు 2022

ఇంకా పరీక్ష ఫలితాలు --- సెప్టెంబర్ 2022

IBPS RRB మెయిన్స్ --- సెప్టెంబర్ లేదా నవంబర్ 2022 లో దరఖాస్తు చేసే ముందు

IBPS RRB 2022 దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నోటిఫికేషన్ ను పూర్తి చదివి ఇక అందులో పేర్కొన్న పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి.అలాగే దరఖాస్తుదారులు IBPS పేర్కొన్న అర్హత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.రిజిస్ట్రేషన్ నంబర్ ఇంకా అలాగే పాస్‌వర్డ్‌ను భద్రపరుచుకోవాలి. అభ్యర్థులు తప్పనిసరిగా పనిచేసే మొబైల్ నంబర్ ఇంకా అలాగే ఇమెయిల్ IDని కలిగి ఉండాలి.అలాగే అభ్యర్థులు తప్పనిసరిగా స్కాన్ చేసిన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి.పాస్‌పోర్ట్ ఫొటో ఇంకా సైన్(నిర్దేశిత కేబీల్లో) ఎడమ చేతి థంబ్ ఇంప్రెషన్ ఉండాలి.ఇక అలాగే IBPS RRB రిక్రూట్‌మెంట్ గ్రూప్ A ఆఫీసర్స్ (స్కేల్-I, II & III) ఇంటర్వ్యూలు ఇదే ప్రక్రియలో NABARD, IBPS సహాయంతో రిజనల్ రూరల్ బ్యాంక్స్ నవంబర్ 2022 లో నిర్వహిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: