ఈ క్వాలిటీ గనుక ఉంటే జాబ్ కన్ఫామ్!

Purushottham Vinay
ఇక ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కన్సల్టింగ్ ఇంకా అలాగే ఐటీ సేవల కంపెనీ మైండ్‌ట్రీ (Mindtree) ఫ్రెషర్లను నియమించుకునేందుకు సిద్ధం అయ్యింది.అయితే ఇక తాము ఉద్యోగం ఇవ్వాలంటే ఫ్రెషర్స్‌ (Freshers)కు మూడు క్వాలిటీలు ఖచ్చితంగా ఉండాలని ఈ కంపెనీ స్పష్టం చేస్తోంది. ఒక ఫ్రెషర్‌లో లెర్న్ (Learn), అడాప్ట్ (Adapt) అయ్యే సామర్థ్యంతో పాటు A అనే ఒక స్కిల్ నుంచి మరొక స్కిల్ ని కూడా అలవర్చుకోగల శక్తి ఉంటే వారిని హైర్ చేసుకుంటామని మైండ్‌ట్రీ కంపెనీ సీఈఓ దేభాషిస్ ఛటర్జీ (Debashis Chatterjee) చెప్పారు. జాబ్ కావాలంటే లెర్న్, అడాప్ట్ ఇంకా అలాగే స్కిల్ చేంజింగ్ ఎబిలిటీ అనే మూడు క్వాలిటీలు ఫ్రెషర్స్‌కు తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు. 2022 వ సంవత్సరంలో దాదాపు 5,000 మంది ఫ్రెషర్లను నియమించుకోనున్నట్లు ఈ కంపెనీ సీఈఓ తెలిపారు.ఇక ఛటర్జీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ఫ్రెషర్లు ఎక్కడి నుంచి వచ్చినా కాని వారు ఇండక్షన్ ప్రోగ్రామ్ (Induction Programme) ద్వారా వెళ్లవలసి ఉంటుందని అన్నారు. ఈ ప్రోగ్రామ్ ని కంపెనీ ఈమధ్యనే కొత్తగా ఇంప్రూవ్ చేసింది. "నేర్చుకునే శక్తి (Learnability) చాలా ముఖ్యమైన అంశం అని నేను భావిస్తున్నాను.


నేర్చుకోవడానికి ఇష్టపడేవారు, కొత్త కండిషన్లకు లేదా పరిస్థితులకు అనుకూలంగా మారిపోయే వారు..ఇక టెక్నాలజీ మారుతున్న విధానాన్ని బట్టి ఒక నైపుణ్యం నుంచి ఇంకో నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి రెడీగా ఉన్నవారిని మాత్రమే మేం వెతుకుతున్నాం," అని ఛటర్జీ తెలిపారు.ఇక గత సంవత్సరంలో డిమాండ్ ఊపందుకోవడంతో కంపెనీ తాజాగా నియామకాలను కూడా వేగవంతం చేసింది. ఇది జనవరి నెల నుంచి మార్చి 2022 త్రైమాసికంలో 1,500 మంది ఫ్రెషర్‌లను రిక్రూట్ చేసుకుంది. 2023 ఫైనాన్షియల్ ఇయర్ లో కంపెనీ చేసే రిక్రూట్మెంట్ల సంఖ్యను ఛటర్జీ చెప్పలేదు కానీ ఈ ఆర్థిక సంవత్సరం గడుస్తున్నా కొద్దీ ఈ సంఖ్య పెరుగుతుందని ఛటర్జీ తెలిపడం జరిగింది. అయితే అంతకుముందు జరిగిన ఇంటరాక్షన్‌లో భాగంగా , ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాదాపు 5,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని ఇంకా అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరంలో దానిని 40 నుంచి 50 శాతం పెంచాలని తాను ప్రణాళికలు రెడీ చేసుకున్నట్లు ఛటర్జీ చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: