CUET 2022: అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పటినుంచంటే?

Purushottham Vinay
CUET 2022: సెంట్రల్ యూనివర్శిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (CUET 2022) దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక దీని కోసం NTA జారి చేసిన నోటీసు ఇలా ఉంది. పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ప్రవేశం కోసం సమాచార బులెటిన్‌ని చూడవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి కావలసిన సెంట్రల్ యూనివర్శిటీల (CUలు) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లు వున్నాయి. CUET 2022 (UG) దరఖాస్తు ఫారమ్‌ను ఫిల్ చెయ్యడానికి కావలసిన అభ్యర్థులు cuet.samarth.ac.in అనే వెబ్‌సైట్‌లో లాగిన్ చేయవచ్చు. ఇక CUET (UG) - 2022 పరీక్ష విషయానికి వస్తే.. ఇది కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించబడుతుంది. అలాగే ఇక ఆన్‌లైన్ అప్లికేషన్ విండో ఏప్రిల్ 30, 2022 వరకు ఓపెన్ చేసి ఉంటుంది. CUET (UG) - 2022 కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) మోడ్‌లో నిర్వహించబడుతున్న కారణంగా ఇక పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు ఇంకా అలాగే అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి కావలసిన సెంట్రల్ యూనివర్శిటీల (CUలు) అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశం కోసం ఇన్ఫర్మేషన్ బులెటిన్‌ను చూడవచ్చు.


ఇక దీనికి సంబంధించిన భాషలు ఇంకా సబ్జెక్టుల విషయాల ఎంపికలు చూసినట్లయితే..సాధారణంగా ఎంచుకున్న భాషలు ఇంకా అలాగే సబ్జెక్ట్‌లు ఒక విద్యార్థి తన తాజాగా చదివిన లేదా పూర్తి చేసుకున్న 12 వ తరగతి బోర్డ్ పరీక్షలో ఎంచుకున్నవే అయి ఉండాలి. ఇక ఏదేమైనప్పటికీ, ఏదైనా విశ్వవిద్యాలయం ఈ విషయంలో ఏదైనా సౌలభ్యాన్ని కనుక అనుమతిస్తే, CUET (UG) -2022 కింద కూడా దీనిని అమలు చేయవచ్చు. అభ్యర్థులు ఖచ్చితంగా ఈ విషయంలో వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల అర్హత అవసరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. ఇక అంతేకాకుండా, అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో అధ్యయనం చేయాల్సిన సబ్జెక్ట్ ఆఫర్ చేస్తున్న 27 డొమైన్ స్పెసిఫిక్ సబ్జెక్ట్ లిస్టులో అందుబాటులో లేకుంటే, అభ్యర్థి తన ఎంపికకు దగ్గరగా ఉన్న సబ్జెక్ట్‌ను ఎంచుకునే అవకాశం వుంది.ఉదాహరణకు బయోకెమిస్ట్రీ కోసం అభ్యర్థి బయాలజీ సబ్జెక్టు ని ఎంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: