మాతృభాషా దినోత్సవం : అమ్మభాషను బ్రతికిద్దాం.. పిల్లలకు నేర్పిద్దాం?

praveen
ప్రతి మనిషి జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నా ఎంతో మంది మనుషులు ఉన్నా.. అటు తల్లి తో ఉండే అనుబంధం.. ఆ బంధం మాత్రం ఎంతో ప్రత్యేకం.. జీవితంలో ప్రతి ఒక్కరూ ఎన్ని భాషలు నేర్చుకున్నప్పటికీ అందరికీ అమ్మ భాష మాత్రం ఎప్పుడూ ప్రత్యేకమే. ఎన్ని భాషలలో మాట్లాడినా అటు మాతృభాషలో మాట్లాడితే మాత్రం మనసు ఎప్పుడూ సంతోష పడి పోతూ ఉంటుంది. ఇలా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్న వారు ఎక్కువగా ఇంగ్లీషులోమాట్లాడటం చేస్తూ ఉంటారు.


 ఇక ఇలాంటి వారికి ఎవరైనా మాతృ భాష మాట్లాడేవారు కనిపించారు అంటే చాలు మనసు మొత్తం ఆనందంతో నిండిపోతుంది. అలా ముందు ఉన్నది ఎవరో తెలియక పోయినా వెంటనే వెళ్లి వారితో మాతృభాషలో మాట్లాడటానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరి మనసులో మాతృభాషకు ప్రత్యేక స్థానం  ఉంటుంది. కానీ నేటి రోజుల్లో మాత్రం ఎంతో మంది యువత మాతృభాషను మాట్లాడటానికి కూడా అస్సలు ఇష్టపడటం లేదు. అవసరం ఉన్నా లేకపోయినా పాశ్చాత్య ఇంగ్లీష్ భాష మాట్లాడేందుకు ఇష్టపడుతున్నారు. ఇలా ఇంగ్లీష్ మాట్లాడటాన్ని నేటి రోజుల్లో ఎంతో గౌరవంగా భావిస్తున్నారు.



 ఇలా ప్రస్తుత సమయంలో మనందరికీ మాతృభాష అయిన తెలుగు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది  ఇక కొన్ని స్కూళ్లలో అయితే తెలుగు మాట్లాడటాన్ని పూర్తిగా నిషేధిస్తూ ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలో తెలుగు భాషను బ్రతికించు కోవాల్సిన అవసరం అందరిపై ఉంది. జీవితంలో ఎదగడానికి.. మంచి ఉద్యోగం సాధించడానికి.. కెరియర్లో ముందుకు సాగడానికి ఇంగ్లీష్ మాట్లాడటం మంచిదే. కానీ అవసరం లేకపోయినప్పటికీ ఇంగ్లీష్ మాట్లాడుతూ మాతృభాషను కించపరచడం మాత్రం సరి కాదు. ఎందుకంటే మన భాషను మనం గౌరవించకపోతే ఇంకెవరు గౌరవిస్తారు. అందుకే వీలైనంత ఎక్కువగా అమ్మ భాషలో మాట్లాడి మన భాషను గౌరవిద్దాం.. మన పిల్లలకు అదే నేర్పిద్దాం.. మన మాతృభాషను బతికించుకుందాం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: