ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు ఎప్పటి నుంచి అంటే..!!

Divya
సాధారణంగా జనవరి ఎండింగ్ లో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలయ్యి ఫిబ్రవరి చివరి వారంలోనే ఇంటర్ పరీక్షలు మొదలవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.. రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారని ఇంటర్ విద్యార్థులు సైతం ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే.. ఇక అలాంటి విద్యార్థులకు ఇప్పుడు హై అలర్ట్ విధించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మరికొంత మంది ఇంటర్ విద్యార్థుల లో టెన్షన్ మొదలైందని చెప్పవచ్చు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఇంటర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జాబితాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది..

అయితే మరికొద్ది రోజుల్లో తెలంగాణలో ఇంటర్ పరీక్షల పండుగ ప్రారంభమవనుంది.. ఇదిలా ఉండగా ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలవబోతున్నాయని ఉన్నాయని గత కొన్ని రోజుల క్రితం ఇంటర్‌ బోర్డు సెక్రెటరీ సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ తెలిపారు. ఈ విద్యాసంవత్సరం నిర్వహించే పరీక్షలకు మొత్తం 6,48,829 మంది విద్యార్థులు హాజరవుతున్నారు అని ఆయన తెలిపారు. ఇక ఇందులో ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి 3,24,469 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు అవుతూ ఉండగా.. ద్వితీయ సంవత్సరం నుంచి 3,24,360 మంది విద్యార్థులు హాజరు కాబోతున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇక ఇంటర్  విద్యార్థుల సంఖ్యను గ్రూపుల వారిగా విభజిస్తే..అందులో  ఎంపీసీ గ్రూప్  లో 3,52,357 మంది, బైపీసీ గ్రూప్ లో 2,06,510 మంది..ఒకేషనల్‌ గ్రూప్ కోర్సుల్లో 89,962 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. ఇక ఈ పరీక్షలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసామని ఇంటర్ బోర్డు అధికారులు కూడా తెలిపారు.

ఇక ప్రాక్టికల్ పరీక్షలు పూర్తి కాగానే  వెంటనే మార్చి 4వ తేదీ నుంచి ఇంటర్ థియరీ పరీక్షలు కూడా  నిర్వహిస్తామని ఆయన తెలిపారు. ఈ పరీక్షలకు 9,65,815 మంది విద్యార్థులు హాజరవుతుండగా   థియరీ పరీక్షల నిర్విహించడానికి 1,339 కేంద్రాలు అలాగే  ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించడానికి 1,506 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: