ఇకపై పాఠశాలల్లో అవి తప్పనిసరి..!!

Divya
తాజాగా ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శన లో సి జి ఐఎన్ వి రమణ మాట్లాడుతూ.. ఇకపై రాష్ట్ర ప్రభుత్వం లో ఉండే ప్రతి పాఠశాలలో కూడా ఒక గ్రంధాలయం, ఆటస్థలం తప్పకుండా ఉండాలి అని ఆయన సూచించారు. పూర్తి వివరాల్లోకి వెళితే మహా నగరం అయినటువంటి హైదరాబాద్లో ఏర్పాటు చేసిన పుస్తకం ప్రదర్శనలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సి జి ఐ ఎన్ వి రమణ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ఉద్దేశించి ప్రతి పాఠశాల , కళాశాల లో తప్పకుండా ఒక గ్రంధాలయం , ప్లేగ్రౌండ్ ఉండాలని ఆయన సూచించారు. ఇలా వీటిని ఏర్పాటు చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అభివృద్ధికి దోహదపడతాయని ఆయన ఉపదేశించారు.

ఇక ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ..పుస్తక పఠనం అనేది విద్యార్థులకు చిన్నప్పటినుంచే అలవాటు గా మార్చితే వారి జీవితంలో ఇది ఒక మంచి అలవాటు అని, క్రీడలు ఆడుతూ ఉండడంవల్ల ఏకాగ్రత పెరుగుతుంది అని భవిష్యత్తులో వారి కంటూ చెరగని  ముద్ర వేస్తారని,అది  పిల్లల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందిస్తుందని ఆయన పేర్కొన్నారు...ఇకపై పాఠశాలలు మరియు కళాశాలల్లో లైబ్రరీలు లేవు అనే మాట వినపడుతుంది అని నేను అనుకోను. ఏ పాఠశాల లేదా కళాశాల ఏర్పాటు చేయాలన్నా లైబ్రరీ , క్రీడాప్రాంగణం అనేది తప్పనిసరి. కానీ ఇప్పటివరకు  ఈ నిబంధనను ఎవరూ పాటించడం లేదు" అని ఆయన వ్యాఖ్యానించారు.

లైబ్రరీల విషయం ప్రక్కన పెడితే చాలా కళాశాలలు లేదా పాఠశాలలో క్రీడా ప్రాంగణం విషయంలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇది తీవ్రమైన ఆలోచించదగిన సమస్య. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలి అని ఆయన వెల్లడించారు.చరిత్రకు సాహిత్య రచయితలు అందించిన సహకారాన్ని CJI గుర్తుకు చేస్తూ, భారత-స్వాతంత్ర్య ఉద్యమంతో సహా ప్రపంచవ్యాప్తంగా జరిగిన అనేక పోరాటాలలో మన పూర్వీకులు  కీలక పాత్ర పోషించారని అన్నారు. చరిత్ర పుస్తకాలను పిల్లలు పఠనం చేయడం వల్ల వారికి అన్ని రంగాలలో మంచి ప్రావీణ్యం లభిస్తుంది అని ఆయన వెల్లడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: