సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎంత గొప్ప వ్యక్తి అంటే...

Purushottham Vinay
భారత రత్న ఇంకా భారతదేశ తొలి ఉప రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 1888లో తిరుత్తనిలో జన్మించారు.మన కేంద్ర ప్రభుత్వం సర్వేపల్లి రాధాకృష్ణన్‌ పుట్టిన రోజుని 1962 సంవత్సరం నుంచి ఉపాధ్యాయ దినోత్సవంగా పరిగణించి ఆయన్ని ఎంతగానో గౌరవిస్తోంది.ఇక సర్వేపల్లి రాధా కృష్ణన్ గారి గొప్పతనం ఎంఎన్‌ రాయ్‌ మాటల్లో చెబితే ఆనాడు భారతదేశంలో ఉన్న మత ఇంకా ఆధ్యాత్మిక పునరుద్ధరణ వాదాన్ని అకడమిక్‌ తాత్విక స్థాయికి తీసుకువెళ్లిన ఏకైక గొప్ప పండితుడు మన సర్వేపల్లి రాధాకృష్ణన్.ఇక సర్వేపల్లి రాధాకృష్ణన్ తన జీవితంలో 15 సార్లు నోబెల్‌ సాహిత్య బహుమతికి ఇంకా 11 సార్లు నోబెల్‌ శాంతి బహుమతికి నామినేట్‌ అవ్వడం జరిగింది.
ఇక ప్రాచీన కాలం మహాభారత కాలం నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని అసలైన గురుశిష్య సంబంధానికి ప్రతీకలుగా కొలుస్తున్నాం. సర్వేపల్లి రాధా కృష్ణన్ తనకు కృష్ణుడితో సమానమని మన దేశ జాతిపిత అయిన మహాత్మా గాంధీజి కీర్తించడం జరిగింది. ‘మీరు నా కృష్ణుడు ఇక నేను మీ అర్జునుడిని’ అన్నారు మహాత్మా గాంధీ. ‘మీరు నా ఉపాధ్యాయుడు’ అని పండిట్‌ నెహ్రూ కీర్తించడం జరిగింది. బహుశా ఈ వ్యాఖ్యల నేపథ్యం నుంచే సర్వేపల్లి పుట్టిన రోజును ఈ నాడు టీచర్స్ డేగా నిర్వహించాలనే ఆలోచన పుట్టడం జరిగింది.ఇక ఈయన గురించి చెప్పాలంటే 'యుగపురుషుల గురించి ఉపన్యాసం ఇవ్వండని పిలిస్తే.. యుగపురుషుడే వచ్చి ఉపన్యసించారు’ అని హోవెల్ కొనియాడటం జరిగింది. ‘నాలో మామూలు మనిషిని దర్శించిన మహర్షి’ అని సోవియట్‌ అధినేత స్టాలిన్‌ కీర్తించడం జరిగింది. అటువంటి గీతాచార్యుడు, ప్రబోధకుడు, యుగపురుషుడు ఇంకా జ్ఞాన మహర్షి.. మన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ గారు.ఈయన గురువులకే గురువు. అందుకే ఈయన పుట్టిన రోజు ఈ నాడు ‘ఉపాధ్యాయ దినోత్సవం’ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: