బ్రతకలేక .. బడిపంతులు ..

ఒకప్పుడు బ్రతకడానికి ఏ పని దొరక్కపోతే చేసే పని ఉపాధ్యాయ వృత్తి. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. విద్య వ్యాపారం అయిన ఇప్పటి సమాజంలో ఈ పరిస్థితి మారింది. చదువుకొని ఉద్యోగం కోసం వెతుక్కోక ముందే, ఆ విద్యాలయంలోనే బోధకుడిగా చేరుతున్నారు చాలా మంది. ప్రైవేట్ విద్య సంస్థలు ఎక్కువ అయ్యే కొద్దీ ఈ పరిస్థితి మరీ దారుణంగా మారింది. కనీస అర్హత లేని వారు కూడా ఉపాధ్యాయులుగా చలామణి అవుతున్నారు. దీనితో విద్యలో నాణ్యతా లోపాలు కూడా పెరిగిపోయాయి.
ప్రైవేట్ విద్యాసంస్థలు ఎక్కువ అయ్యే కొద్దీ ప్రభుత్వ సంస్థలలో విద్యార్థుల సంఖ్య ఘననీయంగా పడిపోవడంతో, బోధించే వారికి సరైన అర్హతలు ఉండి, దానిని నిర్వర్తించే అవకాశాలు లేకపోవడంతో వారి నాణ్యత బూడిదలో పోసిన పన్నీరు మాదిరే ఉంది. దీనితో ఉన్న కొద్ది మంది కూడా ప్రైవేట్ సంస్థల వైపు మొగ్గు చూపిస్తున్నారు. అక్కడ నాణ్యత తక్కువ ఫీజులు ఎక్కువ. అయినా తప్పేది లేక పిల్లల భవిష్యత్తు కోసం వాళ్ళు కూడా ఉన్నది అమ్ముకొని మరీ చదివిస్తున్నారు.
విద్యాసంస్థలలో విద్య నేర్పే వారికి నాణ్యత సమస్య ఒక లోపం అనుకుంటే, వీరికి కనీస వేతనాలు కూడా ఇవ్వక పోవటంతో వీరి నాణ్యత మరీ క్షిణించిపోతుంది. ఇటువంటి పాఠశాలతో అటు ఉపాద్యాయుడు, ఇటు విద్యార్థులు బ్యాగుకునేది ఏమీ లేదు. ఆయా సంస్థలు మాత్రం పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక కరోనా లాంటి సమయాలలో కూడా ఈ సంస్థలు బాగుపడ్డాయి కానీ, అటు విద్యార్థులకు కానీ, ఇటు ఉపాధ్యాయులకు కానీ ఏమీ ఒరిగింది లేదు. ఏ ప్రైవేట్ సంస్థలో చూసినా, అసలు జీతాలు సమయానికి వచ్చేవి కావు, ఇక ఈ కరోనా సమయంలో అయితే అవి అసలే లేవు.
దీనితో చాలా మంది ఉపాధ్యాయుల పరిస్థితి రోడ్డుపైకి వచ్చేసింది. ప్రభుత్వాలు కూడా అన్ని వర్గాల వారిని ఆడుకున్నాయి తప్ప, వీరికి ఎటువంటి భరోసా ఇవ్వలేకపోయాయి. దీనితో అటు జీతాలు ఇవ్వని పని చేసుకోలేక, మరో పనికి పోలేక రెంటికి చెడ్డ రేవడిలా అయ్యింది వీరి పరిస్థితి. కరోనా సమయంలో అసలు ఉద్యోగాలు పోయిన వారుకూడా అనేక మంది ఉన్నారు. వారంతా జీవిత చక్రం ముందుకు పోవడానికి దొరికిన పని అంటే పాయకానా పని నుండి సిమ్మెంట్ పని దాకా అన్నిటికి సిద్ధమయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: