ఇకనుంచి చదువు పూర్తయ్యాక.. విదేశీ విద్యార్థులు అమెరికాలో ఉండలేరా..?

MOHAN BABU
అమెరికాలో  చదువుకునే టువంటి భారత విద్యార్థులకు  ఇక ఇబ్బందులు తప్పవు అంటారా..  ఒకవేళ ఈ బిల్లు కార్యరూపం దాల్చితే  ఇక విదేశీ విద్యార్థులకు  ఉద్యోగాలు దొరకడం కష్టమేనా. వీరంతా ఇబ్బందులు పడే అవకాశం ఉన్నదా ..  అవును చట్ట సభలో ఈ బిల్లు  ప్రవేశపెట్టినట్టు అయితే  అమెరికాలో విద్యనభ్యసిస్తున్న టువంటి విదేశీ విద్యార్థులకు  తీవ్రమైన సమస్యలు ఏర్పడే అవకాశం  ఉంది. ఈ సమస్య ఏంటో  చూద్దాం.. చాలామంది  అమెరికాలో విదేశీ విద్యను అభ్యసించడానికి  వెళ్తుంటారు. విద్య నభ్యసించి మళ్లీ అక్కడే ఉద్యోగాలు కూడా చేస్తుంటారు.

  దీన్ని అమెరికాలో ఆపరేషనల్ ప్రాక్టీస్  ట్రైనింగ్ అంటారు. ఈ బిల్లును  రద్దు చేసేందుకు చట్ట సభలో కొంత మంది ప్రతినిధులు  బిల్లు ప్రవేశ పెట్టారు. ఈ యొక్క బిల్లును ఫెయిర్ నెస్ ఫర్ స్కిల్డ్  యాక్టివ్ గా పిలుస్తున్నారు. ఈ బిల్లు చట్ట రూపం దాల్చినట్లు అయితే  అమెరికాలో విద్యనభ్యసిస్తున్నటువంటి  భారతీయ విద్యార్థులపై  ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. హెచ్ బీ 1 వీసాలపై  పరిమితి అనేది గుర్తించకపోవడం వెనుక   ఉన్నటువంటి ఉద్దేశాన్ని ఓ పి టి తుంగలో తొక్కిందని చట్ట సభ్యులు గోసాల ఆరోపించారు. గ్రాడ్యుయేషన్  చదువు పూర్తయ్యాక  విదేశ విద్యార్థులు మూడు సంవత్సరాల పాటు  అమెరికాలో ఉద్యోగాలు చేసేందుకు ఈ యొక్క కార్యక్రమం  కొన్ని షరతులతో అనుమతిని ఇస్తోందని  పేర్కొన్నారు. వారికి  పన్నుల నుంచి కూడా  మినహాయింపులు  లభిస్తున్నాయని అన్నారు. దీంతో వారు  అమెరికాలో ఉండే విద్యార్థుల కంటే 10-16 శాతం తక్కువ జీతాలకే  ఉద్యోగాలు చేస్తున్నారని వారు వివరించారు. దీని ఫలితంగా స్థానిక అమెరికా యువకులకు  ఉద్యోగాలు దొరకడం అనేది  కష్టంగా మారిందని  చెప్పారు.

ఓ పి టి రద్దు చేయడం కోసం  ఇంకొక చట్ట సభ్యుడు ఆండి బిగ్, బ్రాక్స్, వీరితో కలిసి  ఈ బిల్లును ప్రవేశ పెట్టినట్లు వారు తెలిపారు. కానీ ఇందులో సేనాట్ తో పాటుగా  ప్రజాప్రతినిధుల  సభల్లోనూ  డెమోక్రట్లకే మెజారిటీ ఎక్కువగా ఉన్న సందర్భంగా , ఈ యొక్క బిల్లు ఆమోదం పొందడం  ఈజీ కాదని వారంటున్నారు. గోసర్ ఈ యొక్క బిల్లును ఇంతకుముందు కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టడం జరిగింది. ఏది ఏమైనా ఈ బిల్లు ఆమోదం జరిగితే మాత్రం  అమెరికా లో ఉన్నటువంటి భారత విద్యార్థులకు  ఉద్యోగాల కోత తప్పదనే అంశం  మనకు కనబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: