నిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ అదిరిపోయే గుడ్ న్యూస్..

Satvika
నిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ చక్కటి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఏపిలో నిరుద్యోగుల కళలను సాకారం చేసుకొనే సమయం దగ్గర పడింది.ఈ సంస్థ ఇటీవల వెల్లడించిన నోటిఫికేషన్ ను అందరూ ఉపయోగించుకున్నారు. కాగా, ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలోనే నిత్యం అనేక కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అనేక మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ పై శిక్షణను సైతం అందిస్తున్నారు.ఈ నెల 12న కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీలో వివిధ కంపెనీల్లో ఖాళీల భర్తీకి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది.


జాబ్ మేళా ద్వారా మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఈ కంపెనీలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలు ఉంటాయి. అయితే కేవలం స్త్రీలు మాత్రే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..


ఇది ఇలా ఉండగా.. ఈ జాబ్ లకు వయసు తో సంబంధం ఉంది.ప్రొడక్షన్ ఆపరేటర్, లైన్ లీడర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,200 నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తదితర సదుపాయాలను అందించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.అభ్యర్థుల వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలను అందించనున్నారు... ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ సదరు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: