ప్రభుత్వం సంస్థలలో ఉద్యోగాల కొలువులకు సిద్ధంకండి..ఉద్యోగాల్లో రిజర్వేషన్ల గురించి అందరికీ తెలిసిందే. కులం, స్థానిక ఆధారంగా ఉద్యోగాల్లో ప్రత్యేక సౌకర్యాన్ని కొన్ని వర్గాలకు కల్పిస్తారు. అయితే ప్రైవేటు ఉద్యోగాలకు కూడా రిజర్వేషన్లను అందుబాటులో తీసుకురానుంది హరియాణా రాష్ట్ర ప్రభుత్వం. ప్రైవేటు రంగంలో ఏ ఉద్యోగమైన 75 శాతం స్థానికులకే అవకాశమిచ్చేలా ప్రైవేటు జాబ్ రిజర్వేషన్ చట్టానికి సవరణలు తీసుకొచ్చినట్లు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దుష్యంత్ చౌటాలా ఇటీవల ప్రకటించారు.
మే మొదటి వారం నుంచి ఈ చట్టం అమల్లోకి వస్తుంది. నిన్న గురుగ్రామ్-ఫరిదాబాద్ రహాదారిపై బాంధ్వాడీ గ్రామ సమీపంలో నిర్మించిన ఫ్లై ఓవర్ ప్రారంభ కార్యక్రమానికి వచ్చిన ఆయన ఈ విషయాన్ని గుర్తు చేశారు.2021 మే 1 తర్వాత రాష్ట్రంలో ఏ పరిశ్రమ లేదా సంస్థ నూతనంగా ఉద్యోగులను నియమించుకోవలసి వస్తే ప్రతి నలుగురిలో ముగ్గురికి ఆ రాష్ట్రానికి చెందిన వారినే తీసుకోవాలని ఆయన అన్నారు.
గత కొన్నేళ్ల నుంచి ఏ చట్టం సరిగ్గా అమలు కాలేదని ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.అయితే ఈ చట్టంలో సవరణలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వ పరిశీలిస్తోంది. ఈ చట్టాన్ని తీసుకు రావడానికి ముందు మేము పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులతో 8 దశల్లో సమావేశాలు నిర్వహించి సమగ్రంగా చర్చించాం. వారి వద్ద నుంచి రాతపూర్వక సూచనలు కూడా కోరాం అని దుష్యంత్ చౌటాలా తెలిపారు. వారం క్రితం పారిశ్రామిక వేత్తలు, నిపుణులతో సమావేశం నిర్వహించినట్లు హర్యానా ఉప ముఖ్య మంత్రి పేర్కొన్నారు.
పరిశ్రమల్లో లేదా స్పెషల్ స్కిల్స్ ను ఉపయోగించే ప్రైవేటు సంస్థల్లోని సాంకేతిక పోస్టులను ఈ చట్టం నుంచి మినహాయింపు ఇవ్వాలని చాలా మంది సూచించారు. అందుకని టెక్నికల్ స్కిల్స్ కలిగిన పోస్టులకు ఈ చట్టం నుంచి మినహాయింపు లభిస్తుందని, దీన్ని ఇప్పటికే ఈ చట్టంలో నిబంధన ప్రవేశ పెట్టారు. ప్రైవేటు ఉద్యోగుల రిజర్వేషన్ల హామీ ఇచ్చారు. ప్రైవేటు రంగంలో మూడో వంతు ఉద్యోగాలు స్థానికులకే పొందేలా చూస్తామని