తెలంగాణలో 45 వేల పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

Satvika
తెలంగాణ సర్కార్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.. కరోనా కారణంగా ఈ ఏడాది లో ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేక యువత అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంత మందికి ఉన్న ఉద్యోగాలు కూడా పోయి, కుటుంబ పోషణ చేసే మార్గాలు కనిపించక ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు సర్కార్ అలాంటి వారి కలలను సాకారం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిరుద్యోగ సమస్యలను తీర్చడానికి ప్రభుత్వ ఉద్యోగ నియామకాల  పై దృష్టి సారించారు.  ఈ మేరకు ఏయే శాఖలో ఏ పోస్ట్ భర్తీ చేయాలి అనే అంశాలను పరిగణించింది..

ఇందులో భాగంగా తెరాస ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో ఉద్యోగ ఖాళీల వివరాలు సోమవారం రాత్రి ప్రభుత్వానికి చేరాయి. రాష్ట్రంలోని వివిధ శాఖల్లో సుమారు 45 వేలు, సంస్థల్లో 20 వేలు భర్తీ చేయాల్సి ఉందని ముఖ్య కార్యదర్శులు ప్రభుత్వానికి నివే ధికను అందించారు..ఇందులో నాలుగో తరగతి ఉద్యోగుల వివరాలు ఉన్నట్టు తెలిపారు. ఒప్పంద మరియు పొరుగు సేవల ఉద్యోగుల సంఖ్యను విడిగా పొందుపరిచారు. ఆ ప్రకారం పోలీసు, విద్య, వైద్యఆరోగ్య శాఖలలో ఖాళీలు ఎక్కువగా ఉన్నట్లు ఆ నివేదికలో పేర్కొన్నారు..

ఏయే సంస్థలో ఎన్ని ఖాళీలు ఉన్నాయో పరిశీలిస్తే.. పాఠశాల విద్యాశాఖలో 9,600 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు విద్యా శాఖ ఉన్నతాధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇందులో ప్రత్యేక గ్రేడ్‌ ఉపాధ్యాయులు 5,800, స్కూలు అసిస్టెంట్లు 2,500, భాషాపండితులు, వ్యాయామ ఉపాధ్యాయులు 300, మోడల్‌ పాఠశాలల ఉపాధ్యాయుల పోస్టులు 1000 ఉన్నాయి. ఇవిగాక ఉన్నత విద్య, విశ్వ విద్యాలయాలు, సాంకేతిక విద్యాశాఖల పోస్టులు మరో మూడు వేల వరకు ఉన్నాయి. శాఖల వారిగా వచ్చిన వివరాలను ఆర్థిక శాఖ క్రోడీ కరిస్తోంది. మొత్తం పోస్టుల్లో నాలుగో తరగతివి మినహాయించి, మిగిలినవి ఖాళీగా చూపనున్నట్లు వెల్లడించింది. ఒకటి, రెండురోజుల్లో కచ్చితమైన సంఖ్యపై స్పష్టత వచ్చే వీలుందని సమాచారం..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: