కలెక్టర్ అవ్వాలనుకున్న వారికి స్కాలర్షిప్స్ ఇవ్వబోతున్న సోను సూద్..!
ప్రస్తుత కరోనా వైరస్ కారణంగా ఇంట్లోనే ఉండి ఆన్లైన్ క్లాసుకు అటెండ్ కాలేకపోతున్న కొంత మంది వివరాలను తెలుసుకొని వారికి స్మార్ట్ ఫోన్ లను పంపారు. ఇక మరికొంతమంది నీట్, జేఈఈ పరీక్షలు రాయడానికి విద్యార్థులు చాలా దూర ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు వెళ్లేటందుకు కూడా ఆయన విద్యార్థులకు సహాయం అందించారు. అంతేకాదు కొంత మంది విద్యార్థుల కోసం స్కాలర్షిప్ అందించేందుకు https://scholifyme.com/ అనే వెబ్సైట్ ను కూడా ఇది వరకే ప్రారంభించారు. ఇక ఇవన్నీ పక్కన పెడితే తాజాగా సోనుసూద్ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దేశంలో చాలా మందికి ఆర్ధిక ఇబ్బందుల వల్ల చదువుకోలేకపోతున్నారన్న ఉద్దేశంతో ఆయన చదువుకోలేని వారికి సహాయం చేయడానికి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాడు.
ఇందులోభాగంగా తాజాగా ప్రొఫెసర్ సరోజ్ సూద్ మరణించి 13 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆమె పేరు మీద సోనుసూద్ ఈ స్కాలర్షిప్ లను అందించబోతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఇందులో ఎవరైనా కలెక్టర్ అవ్వాలనుకునేవారు సివిల్ పరీక్షలు రాయాలి. ఈ పరీక్షలు రాయాలి అంటే అంత ఆషామాషీ విషయం కాదు. అందుకు ఎంతో కఠినంగా ప్రిపేర్ అయ్యి ఉండాలి. కాబట్టి ఇలా ప్రిపేర్ అయ్యే సమయంలో ఎలాంటి ఆలోచనలు ఉండకుండా పూర్తిగా కాన్సన్ట్రేషన్ మొత్తం చదువుపై ఉంటేనే అందులో విజయం సాధించగలం. అయితే ఇంటి పరిస్థితుల కారణంగా చదువుకోలేక ఉద్యోగాలు చేయడం లేకపోతే మరి ఏదో పనులు చేసుకోవడం లాంటి వాటిపై దృష్టి పెడితే చదువుకోడానికి కష్టంగా ఉంటుందని భావించిన ఆయన అలాంటి వారి కోసం ఈ స్కాలర్షిప్ ఇవ్వడం మొదలు పెట్టినట్లు ఆయన తెలియజేశారు.