చ‌రిత్ర‌లో ఆగ‌స్టు 27వ తేదీకి ఎంతో ప్రాధాన్యం... విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను. ...మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో ఆగ‌స్టు 27వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

1995 : ఈటీవీ తెలుగు ప్రసారాలు (టి.వి. ఛానెల్) ప్రారంభమయ్యాయి.
1955: గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ మొదటి సంచిక ప్రచురించబడింది.
2003: దాదాపు గత 60, 000 సంవత్సరాలలో, అంగారక గ్రహం, భూమికి అతి దగ్గరగా వచ్చింది.

జననాలు
1898: రాజరత్నం పిళ్ళై, నాదస్వర విద్వాంసుడు. (మ.1956)
1908: డోనాల్డ్ బ్రాడ్‌మాన్, అద్భుతమైన సార్వకాలిక బ్యాట్స్‌మన్‌గా పేరు గాంచిన ఆస్ట్రేలియా క్రికెటర్. (మ.2001)
1908: లిండన్ బి జాన్సన్, రాజకీయవేత్త, రచయిత. (మ.1973)
1909: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (మ.1970)
1928: వోలేటి వెంకటేశ్వర్లు, సంగీత విద్వాంసుడు. (మ.1989)
1933: నాన్సీ ఫ్రైడే, స్త్రీ లైంగిక తత్వం, స్వేచ్ఛల పై పుస్తకాలని వ్రాసిన రచయిత్రి (మ.2017).
1955: వల్లూరు శివప్రసాద్, నాటకకర్త.
1957: నూతలపాటి వెంకటరమణ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి.
1963: సుమలత, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమా నటి.
1972: ఖలీ, భారతీయ మల్లయోధ నిపుణుడు, నటుడు.
మరణాలు

1534: ఇస్మాయిల్ ఆదిల్‌షా, బీజాపూరు (1510 నుండి 1534 వరకు) సుల్తాను. (జ.1498) బీజాపూరు సుల్తాను. ఈయన 1510 నుండి 1534 వరకు బీజాపూరును పరిపాలించాడు. తన పరిపాలనా కాలమంతా రాజ్యవిస్తరణలో గడిపిన ఇస్మాయిల్ ఆదిల్‌షా దక్కన్ ప్రాంతములో ఆదిల్‌షాల అధికారమును పటిష్ఠం చేశాడు. ఇస్మాయిల్ ఆదిల్‌షా బాల్యంలోనే తండ్రి యూసుఫ్ ఆదిల్‌షా తరువాత బీజాపూరు రాజైనాడు. రాజవ్యవహారాలు మంత్రి కమాల్ ఖాన్ చేతులో ఉండేవి. కమాల్ ఖాన్ పాలిస్తున్న దశలో ఆయన ఇస్మాయిల్ ఆదిల్‌షాను బంధించి రాజ్యాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, రాజమాత పుంజీ ఖాతూన్ పన్నాగానికి పైఎత్తువేసింది. కమాల్ ఖాన్ రాజ మందిరములో కత్తితో పొడిచి చంపబడ్డాడు.
1976: ముకేష్, భారతీయ హిందీ సినిమారంగ నేపథ్య గాయకుడు. (జ.1923)
2002: సింగరాజు రామకృష్ణయ్య, ఉపాధ్యాయుడు, ఏ.పి.టి.యఫ్ ప్రధాన కార్యదర్శి. (జ.1911) .
2006: హృషికేష్ ముఖర్జీ, భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకుడు. (జ.1922)
2010: కంభంపాటి స్వయంప్రకాష్, ఆయుర్వేద వైద్యుడు, లైంగిక వ్యాధుల నిపుణుడు. (జ.1962)

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: