యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుకు రెండు రోజులే గ‌డువు!!

Kavya Nekkanti

ప్ర‌స్తుతం ప్ర‌పంచ‌దేశాలు క‌రోనా కోరల్లో చిక్కుకుని విల‌విల‌లాడిపోతున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అన్ని రంగాలు తీవ్ర న‌ష్టాన్ని ఎదుర్కొంటున్నాయి. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ప‌లు కంపెనీలు నిరుద్యోగుల‌ను ఆదుకునేందుకు ముందుకు వ‌స్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే నిరుద్యోగులకు శుభవార్త చెబుతూ.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

 

ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 94 ఖాళీలు ఉన్నాయి. చీఫ్ డిజైన్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. ద‌ర‌ఖాస్తు చేయడానికి జూలై 30 చివరి తేదీగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేష‌న్‌లో వెల్ల‌డించింది. దీనిని బ‌ట్టీ, ఈరోజు, రేపు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. ఇక ఈ రిక్రూట్మెంట్ సంబంధించి పూర్తి వివరాలు చూస్తే ఈ విధంగా ఉన్నాయి. 

 

ఇందులో మొత్తం ఖాళీలు 94 ఖాళీలు ఉండగా... చీఫ్ డిజైన్ ఆఫీసర్- 1, డిప్యూటీ సూపరింటెండెంట్- 2, అసిస్టెంట్ ఇంజనీర్- 63, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్- 1, అసిస్టెంట్ డైరెక్టర్- 13అసిస్టెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్- 2, డిప్యూటీ డైరెక్టర్- 3, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్- 2, రీజనల్ హోమ్ ఎకనమిస్ట్- 1, అసిస్టెంట్ లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్- 3, సైంటిస్ట్ బీ (కంప్యూటర్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)- 1, సైంటిస్ట్ సీ (సీనియర్ హైడ్రాలజిస్ట్)- 3, రీసెర్చ్ ఆఫీసర్- 1, అసిస్టెంట్ సెక్రెటరీ- 1 పోస్టులున్నాయి. ర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు. కాగా, ఈ నోటిఫికేషన్లకు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ లో తెలుసుకోవ‌చ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌లెను.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: