తెలంగాణలోని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ఉద్యోగాలు...!

Kothuru Ram Kumar

తాజాగా తెలంగాణ రాష్ట్రములోని పీవీ న‌ర‌సింహారావు తెలంగాణ వెట‌ర్న‌రీ యూనివ‌ర్సిటీలో ( PVNRTUV ) ఖాళీగా ఉన్న కొన్ని పోస్ట్లు భర్తీ చేయడానికి నోటిఫ్కేషన్ ను విడుదల చేసింది. ఈ నోటిఫ్కేషన్ లో భాగంగా ల్యాబ్‌టెక్నీషియ‌న్‌, వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ ఉద్యోగాల భర్తీ కోసం రాత ప‌రీక్ష ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఇందు కోసం తెలంగాణ రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (TSPSC) నోటిఫికేష‌న్ ను విడుద‌ల చేసింది.  

 


ఇక ఈ ఉద్యోగాలకు అర్హ‌త‌ల విషయానికి వస్తే ల్యాబ్‌టెక్నీషియ‌న్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండటంతో పాటు మెడిక‌ల్ ల్యాబ్ టెక్నాల‌జీలో డిగ్రీ లేదా మెడిక‌ల్ ల్యాబొరేట‌ర్ టెక్నాల‌జీలో డిప్లొమా కచ్చితంగా చేసి ఉండాలి. అలాగే 22 వెట‌ర్న‌రీ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలు జ‌న‌ర‌ల్ 7, బీసీ 2, ఎస్సీ-2, ఎస్టీ-1, పీహెచ్‌సీ-1 చొప్పున పోస్టులకు రిజర్వేషన్ చేయబడి ఉన్నాయి. ఇందుకోసం విద్య అర్హ‌త‌లు చూస్తే వెట‌ర్న‌రీ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసే అభ్యర్థులు 10వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు యానిమ‌ల్ హ‌జ్బండ‌రీ, పౌల్ట్రీ కోర్సులో రెండు సంవత్సరాలలో పాలిటెక్నిక్ డిప్లొమాలో కచ్చితంగా పాస్ అయ్యుండాలి.

 

ఇక ఈ ఉద్యోగాల కోసం ద‌ర‌ఖాస్తు విధానం పూర్తిగా ఆన్‌లైన్ ‌లో చేయాలిసి ఉంటుంది. ఇక ద‌ర‌ఖాస్తు ఫీజు రూ. 200. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ రూ.80 చెల్లించాలి. ఇక వ‌య‌స్సు చూస్తే 18 నుంచి 34 ఏళ్ల లోపు వారు ఈ ఉద్యోగాలకు అర్హులుగా ప్రకటిస్తున్నట్టు టిఎస్పీఎస్సీ స్పష్టం చేసింది. ఇకపోతే ప్ర‌భుత్వ నిబంధ‌న‌ల ప్ర‌కారం వ‌యోప‌రిమితిలో సడ‌లింపు ఉంటుందని టిఎస్పీఎస్సీ ( TSPSC ) తెలియచేసింది. ఇక రాత‌ప‌రీక్ష ఆధారంగా అభ్యర్థుల ఎంపిక విధానం జరుగును. ముఖ్యమైన తేదీలు చూస్తే... ద‌ర‌ఖాస్తులు ప్రారంభ తేది - జూలై 28, ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రితేదీ ఆగ‌స్టు 17, ఇక పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in  వెబ్‌సైట్‌ ను సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: