ఎస్‌బీఐలో ఉద్యోగాల పండుగ.....ఈ సారి భారీగానే !!!

ఎస్‌బీఐ లో 8134 జూనియ‌ర్ అసోషియేట్ (క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌) పోస్టుల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న విడుద‌లైంది. అమరావతి సర్కిల్ లో 150, హైదరాబాద్ సర్కిల్ లో 375 ఖాళీలు ఉన్నాయి. ఆన్‌ లైన్‌ లో నిర్వ‌హించే ప్రిలిమ్స్‌, మెయిన్స్ ప‌రీక్ష‌ల్లో చూపిన ప్ర‌తిభ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక‌చేస్తారు.

 

అర్హ‌తలు‌: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: జ‌న‌వ‌రి 1, 2020 నాటికి 20 -28 ఏళ్లలోపు ఉండాలి. అంటే జ‌న‌వ‌రి 2, 1992 కంటే ముందు; జ‌న‌వ‌రి 1, 2000 త‌ర్వాత జ‌న్మించిన‌వాళ్లు అన‌ర్హులు. (ఎస్సీ, ఎస్టీల‌కు అయిదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, దివ్యాంగుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌యఃప‌రిమితిలో స‌డ‌లింపులు వ‌ర్తిస్తాయి. ఎంపిక విధానం: ఆన్‌లైన్‌లో నిర్వ‌హించే ప్రిలిమ్స్, మెయిన్స్‌ ఎగ్జామ్‌ల ద్వారా


మెయిన్స్ ఎగ్జామ్‌: దీనిలో 4 సెక్ష‌న్లు ఉంటాయి. సెక్ష‌న్‌-1లో జ‌న‌ర‌ల్ / ఫైనాన్షియ‌ల్ అవేర్‌నెస్ నుంచి 50 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వీటిని 35 నిమిషాల్లో పూర్తిచేయాలి. సెక్ష‌న్ -2 జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్ 40 ప్ర‌శ్న‌లు, 35 నిమిషాలు, సెక్ష‌న్‌-3 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 ప్ర‌శ్న‌లు వీటికి 45 నిమిషాలు, సెక్ష‌న్ -4 రీజ‌నింగ్ అబిలిటీ, కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్ 50 ప్ర‌శ్న‌లు వ‌స్తాయి. వ్య‌వ‌ధి 45 నిమిషాలు. వీటికి 60 మార్కులు. మిగిలిన అన్ని సెక్ష‌న్ల‌కు ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు. మొత్తం 190 ప్ర‌శ్న‌లకు 200 మార్కులు కేటాయించారు. ప‌రీక్ష కాలవ్య‌వ‌ధి 2 గంట‌ల 40 నిమిషాలు.

 

ప్రిలిమ్స్‌, మెయిన్స్ రెండు ప‌రీక్ష‌ల్లోనూ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికీ 0.25 చొప్పున మార్కులు కోతవిధిస్తారు. ప్రిలిమ్స్‌, మెయిన్స్ రెండు ప‌రీక్ష‌ల్లోనూ సెక్ష‌న్ల‌వారీ క‌టాఫ్ మార్కులు ఉంటాయి. అలాగే పేప‌ర్ మొత్తానికి కూడా క‌టాఫ్ మార్కులు ఉంటాయి. వీటిని ఎస్‌బీఐ నిర్ణ‌యిస్తుంది. ప్రిలిమ్స్‌లో అర్హ‌త సాధించిన అభ్య‌ర్థుల నుంచి ఆయా విభాగాల‌వారీ మొత్తం ఖాళీల‌కు ప‌ది రెట్ల సంఖ్య‌లో అభ్య‌ర్థుల‌ను మెయిన్స్‌కు ఎంపిక‌చేస్తారు. ప్రిలిమిన‌రీ అర్హ‌త ప‌రీక్ష మాత్ర‌మే. మెయిన్స్‌లో సాధించిన మార్కుల‌ను తుది ఎంపిక‌లో ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటారు. అభ్య‌ర్థులు ఏ స‌ర్కిల్ పోస్టుల‌కైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అయితే ఆ స‌ర్కిల్‌కు కేటాయించిన ఏదో ఒక స్థానిక భాష‌లో చ‌ద‌వ‌డం, రాయ‌డం, మాట్లాగ‌ల‌గ‌డం త‌ప్ప‌నిస‌రి.

 

దర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్ససర్వీస్‌మెన్‌కు ఫీజు లేదు; జ‌న‌ర‌ల్‌, ఓబీసీ అభ్య‌ర్థుల‌కు రూ.750.
చివరితేదీ: జనవరి 26,   ప్రిలిమిన‌రీ ప‌రీక్ష‌లు: ఫిబ్రవరి / మార్చిలో నిర్వ‌హిస్తారు.
మెయిన్స్ ప‌రీక్ష‌: ఏప్రిల్ 19న
ఆన్‌లైన్ ప్రిలిమ్స్‌ పరీక్ష కేంద్రాలు: ఏపీలో చీరాల‌, గుంటూరు, కడప, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం. తెలంగాణ‌లో హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
పే స్కేల్‌: రూ. 13075-31450. మెట్రోల్లో ఉద్యోగం పొందిన‌వారు అన్నీ కలుపుకోని సుమారు రూ.26,000 వేత‌న రూపంలో పొంద‌వ‌చ్చు.
వెబ్‌సైట్‌: www.sbi.co.in

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: