తెలంగాణలో ఉద్యోగాలు.. ఈరోజే ( 30 తేదీ ) లాస్ట్ ఛాన్స్..?
ప్రతి రాష్ట్రంలో ప్రతిష్టాత్మక ఆరోగ్య సంస్థ ఉండాలన్న ఆశయంతో కేంద్రం ఎయిమ్స్ సంస్థలను స్థాపించింది. తెలంగాణలో ఎయిమ్స్ సంస్థను హైదరాబాద్ నగర శివార్లలోని బీబీ నగర్లో నెలకొల్పారు. ఇందులో పలు ఉద్యోగాలకు కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ వచ్చింది.
ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబరు 29, 30 తేదీల్లో నేరుగా ఇంటర్వ్యూకు వెళ్లవచ్చు. ఇంటర్వ్యూ కోసం నేరుగా ఎయిమ్స్, భోపాల్ వెళ్లాల్సి ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. తెలంగాణలోని ఎయిమ్స్, బీబీనగర్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.
ఎయిమ్స్-భోపాల్ ఆధ్వర్యంలోని బీబీనగర్ (తెలంగాణ) ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ఒప్పంద ప్రాతిపదికన కింది టీచింగ్ పోస్టుల భర్తీకి వాక్ఇన్ నిర్వహిస్తోంది. ఇక్కడ మొత్తం 18 ఖాళీలు ఉన్నాయి.
ఇవన్నీ అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు . డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, తదితర విభాగాల్లో ఉద్యోగాలు ఉన్నాయి. సంబంధిత స్పెషలైజేషన్లో పీజీ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. టీచింగ్/ పరిశోధన అనుభవం కూడా పరిగణనలోకి తీసుకుంటారు. మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన వెబ్సైట్: https://www.aiimsbhopal.edu.in/