"FCI"...లో 4,103 ఉద్యోగాలు..ఆఖరుతేదీ :

NCR

ఎఫ్‌సీఐ ( భారత ఆహార సంస్థ) లో పలు విభాగాలలో ఉద్యోగాల భర్తీకి ధరఖాస్తులని కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం జోన్ల వారీగా పోస్తులని చేపట్టనుంది. సౌత్ జోన్ లో పోస్టుల సంఖ్య -540. అయితే ఈ ఉద్యోగాలకి సంభందించి రెండు దశల్లో ఆన్లైన్ పరీక్షలు జరుగుతాయి...వివరాలలోకి వెళ్తే..

 

 

పోస్టులు వివరాలు..
ఖాళీల సంఖ్య:  4,103

సౌత్‌జోన్ - 540, నార్త్‌జోన్ -1,999, ఈస్ట్‌జోన్ -538, వెస్ట్‌జోన్ -735, నార్త్‌ఈస్ట్ -291 
గమనిక: అభ్యర్థులు ఏదైనా ఒక జోన్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

సౌత్ జోన్‌లో 540 ఖాళీలు: 

సౌత్ జోన్‌లో జూనియర్ ఇంజనీర్ (సివిల్)-26, జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ మెకానికల్)-15, స్టెనో గ్రేడ్2-7, అసిస్టెంట్ గ్రేడ్-2(హిందీ)-15, టైపిస్ట్(హిందీ)-3, అసిస్టెంట్ గ్రేడ్ 3 (జనరల్)-159, అసిస్టెంట్ గ్రేడ్(ఏజీ) 3(అకౌంట్స్)- 48, ఏజీ3 (టెక్నికల్)-54, ఏజీ3(డిపో)- 213


అర్హతలు..
జూనియర్ ఇంజనీర్(సివిల్):  సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ/డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఉండాలి. డిప్లొమా అభ్యర్థులకు సంబంధిత విభాగంలో ఏడాది అనుభవం అవసరం.
జూనియర్ ఇంజనీర్(ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్): డిగ్రీ/డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్. డిప్లొమా అభ్యర్థులకు సదరు రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 28 ఏళ్లు

స్టెనో గ్రేడ్-2:   డిగ్రీతోపాటు డీఓఈఏసీసీ(డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అక్రిడియేషన్ ఆఫ్ కంప్యూటర్ కోర్సెస్)లో లెవల్ ఓ అర్హత ఉండాలి. (లేదా) కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ అప్లికేషన్‌లో డిగ్రీ ఉండాలి. వీటితోపాటు టైపింగ్ నిమిషానికి 40 పదాలు, షార్ట్‌హ్యాండ్‌లో 80 పదాలు టైప్ చేయగలగాలి. 
వయోపరిమితి: 25 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్-2(హిందీ): ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హిందీ ఒక ప్రధాన సబ్జెక్టుగా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం ఉండాలి. ఇంగ్లిష్ నుంచి హిందీలోకి, హిందీ నుంచి ఇంగ్లిష్‌లోకి అనువాదం చేయగలగాలి. హిందీలో పీజీ పూర్తిచేసి ఉండటం అభిలషణీయం. 
వయోపరిమితి: 28 ఏళ్లు

టైపిస్ట్(హిందీ):  డిగ్రీ లేదా తత్సమాన విద్యార్హతతోపాటు హిందీలో నిమిషానికి 30 పదాలు టైప్ చేయగలగాలి. హిందీ, ఇంగ్లిష్ టైపింగ్ వచ్చి కంప్యూటర్ పరిజ్ఞానం తెలిసి ఉండాలి.
వయోపరిమితి: 25 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్-3(జనరల్):  ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 27 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్-3 (అకౌంట్స్):  కామర్స్ డిగ్రీతోపాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయోపరిమితి: 27 ఏళ్లు

అసిస్టెంట్‌గ్రేడ్-3(టెక్నికల్): బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ(బోటనీ/జువాలజీ/బయోటెక్నాలజీ /బయోకెమిస్ట్రీ/మైక్రోబయాలజీ/ఫుడ్ సైన్స్) (లేదా) బీఈ/బీటెక్(ఫుడ్ సైన్స్/ఫుడ్ సైన్స్- టెక్నాలజీ/అగ్రికల్చరల్ ఇంజనీరింగ్/బయోటెక్నాలజీ) విద్యార్హత ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 27 ఏళ్లు

అసిస్టెంట్ గ్రేడ్ -3 (డిపో): ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాట కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
వయోపరిమితి: 27 ఏళ్లు

 

ముఖ్య సమాచారం : 
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 2019 మార్చి 25
దరఖాస్తు రుసుం: రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు మినహాయింపునిచ్చారు.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్:  fci.gov.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: