“ 10 పాస్" తో ఇండియన్ ఆయిల్” లో ఉద్యోగాలు..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్
లిమిటెడ్ (ఐఓసీఎల్) సదరన్ రీజియన్లో 58 జూనియర్ ఆపరేటర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది...చాలా
నెలల తరువాత మళ్ళీ ఇండియన్ ఆయిల్ లో ఉద్యోగాలు భర్తీ చేసి నిరుద్యోగులకి శుభవార్త
అందించింది..అయితే ఈ ఉద్యోగాలకి పదవ తరగతి ఉత్తీర్ణత మరియు ఐటీఐ ఉత్తీర్ణత ఉంటే
సరిపోతుందని తెలిపారు..
ఖాళీల వివరాలు..
జూనియర్ ఆపరేటర్ గ్రేడ్-1: 25 పోస్టులు.
అర్హత: పదోతరగతి ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడులో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత, ఒక ఏడాది అనుభవం ఉండాలి.
జూనియర్ ఆపరేటర్ (ఏవియేషన్)
గ్రేడ్-1: 33 పోస్టులు.
అర్హత: ఇంటర్ ఉత్తీర్ణతతో పాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లెసైన్స్, ఒక ఏడాది అనుభవం ఉండాలి.
వయసు: 18-26 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ ప్రొఫిషియన్సీ ఫిజికల్ టెస్ట్ (ఎస్పీపీటీ) ద్వారా.
రాతపరీక్ష తేదీ: జూలై 15, 2018
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు: రూ.150
ఆన్లైన్ దరఖాస్తు
ప్రారంభం: మే 26, 2018
ఆన్లైన్ దరఖాస్తుకు
చివరితేదీ: జూన్ 16, 2018
మరిన్ని వివరాలు వెబ్సైట్లో చూడొచ్చు
వెబ్సైట్: www.iocl.com