"సీఐఎస్‌ఎఫ్" లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్

Bhavannarayana Nch

చాలా మంది విద్యార్ధులు చదువులలో కంటే ఆటలలో ఎక్కువగా రాణిస్తారు..వారిలో ఎంతో మందిలో చదువుతో పాటు క్రీడాంశాలలో ఎక్కువ నైపుణ్యం ఉంటింది..ఎంతో మంది యువత స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు..అయితే ఈ మధ్య కాలంలో..సెంట్రల్ గవర్నమెంట్ ఎన్నో ఉద్యోగ అవకాశాలు కలిపిస్తోంది..ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)...స్పోర్ట్స్ కోటా కింద 118 ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.


పోస్టు-ఖాళీలు:  అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ (ఏఎస్‌ఐ)-31; హెడ్ కానిస్టేబుల్ (హెచ్‌సీ)-87. 

క్రీడా విభాగాల వారీ ఖాళీలు:  అథ్లెటిక్స్-20; బాక్సింగ్-9; బాస్కెట్‌బాల్-10; ఫుట్‌బాల్-10; జిమ్నాస్టిక్స్-3; హాకీ-6; జూడో-10; షూటింగ్-16; స్విమ్మింగ్-8; వాలీ బాల్-10; రెజ్లింగ్-6; వెయిట్ లిఫ్టింగ్-10. 

వేతనశ్రేణి:  ఏఎస్‌ఐ-రూ.29,200-రూ.92,300; హెచ్‌సీ-రూ.25,500-రూ.81,100. 
అర్హతలు:  ఏఎస్‌ఐకి డిగ్రీ, హెచ్‌సీకి ఇంటర్మీడియెట్/తత్సమాన విద్యలో ఉత్తీర్ణతతోపాటు సంబంధిత క్రీడల్లో సీనియర్/జూనియర్ కేటగిరీలో అంతర్జా తీయ/జాతీయ/ అంతర్రాష్ట్ర/రాష్ట్ర/ ఇంటర్ యూనివర్సిటీ స్థాయి పోటీల్లో వ్యక్తిగత/బృంద విభాగంలో ప్రాతినిథ్యం/ పతకం ఉండాలి. 

వయసు:  ఏఎస్‌ఐకి 20-25 ఏళ్ల లోపు; హెచ్‌సీకి 18-23 ఏళ్ల లోపు ఉండాలి. రిజర్వేషన్లు వర్తిస్తాయి. 
శారీరక ప్రమాణాలు: ఏఎస్‌ఐ పోస్టులకు ఎస్టీ కేటగిరీలోని పురుషులకు ఎత్తు-162.5 సెం.మీ., ఛాతీ-77 సెం.మీ. (సాధారణం)-82 సెం.మీ. (గాలి పీల్చినపుడు); మహిళలకు ఎత్తు-154 సెం.మీ. ఉండాలి. జనరల్/ ఓబీసీ/ఎస్సీ కేటగిరీలోని పురుషులకు ఎత్తు-170 సెం.మీ., ఛాతీ- పురుషులకు 80 సెం.మీ. (సాధారణం)- 85 సెం.మీ. (గాలి పీల్చిన పుడు); మహిళలకు ఎత్తు-157 సెం.మీ.

హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు ఎత్తు-పురుషులకు 167 సెం.మీ., మహిళలకు 153 సెం.మీ.; ఛాతీ-పురుషులకు 81 సెం.మీ. (సాధారణం)-86 సెం.మీ. (గాలి పీల్చినపుడు).

గమనిక:  అన్ని పోస్టుల అభ్యర్థులకూ ఎత్తు, వయసుకు అనుగుణంగా ఆరోగ్య/క్రీడా ప్రమాణాలను బట్టి బరువు ఉండాలి. 
మెడికల్ స్టాండర్డ్స్: దృష్టి సామర్థ్యం 6/6, 6/9 (గ్లాసెస్ లేకుండా) ఉండాలి. అలాగే తగిన వినికిడి సామర్థ్యం, ఆరోగ్యం తదితర ప్రమాణాలు తప్పనిసరి. 
ఎంపిక:  క్రీడా విభాగంలో ట్రయల్ టెస్ట్, ప్రొఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్. 
దరఖాస్తు రుసుం:  రూ.100; ఎస్సీ/ఎస్టీ/ మాజీ సైనికోద్యోగ కేటగిరీలకు ఫీజు లేదు.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. 
దరఖాస్తు చేరడానికి చివరి తేదీ:  జనవరి 25, 2018.
పూర్తి వివరాలు వెబ్‌సైట్‌లో చూడొచ్చు

వెబ్‌సైట్:  www.cisfrectt.in


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: