విచిత్రం.. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జూబ్లీహిల్స్ లేదు తెలుసా?
ఉప ఎన్నికల సమయంలో ఈ అంశం మరింత ఆసక్తి రేకెత్తిస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏడు డివిజన్లతో ఏర్పడింది. షేక్‌పేట ఎర్రగడ్డ బోరబండ రహ్మత్‌నగర్ వెంగళరావునగర్ యూసుఫ్‌గూడ సోమాజిగూడ ప్రాంతాలు మాత్రమే ఇందులో భాగం. జీహెచ్‌ఎంసీ 114వ వార్డు జూబ్లీహిల్స్ డివిజన్ పేరు మోస్తుంది. అయినా ఆ వార్డు కూడా ఈ నియోజకవర్గంలో చేరలేదు. మైసూరు బొండాలో మైసూరు లేనట్టు ఇక్కడ జూబ్లీహిల్స్ లేదు. ఈ వాస్తవం రాజకీయ విశ్లేషకులను ఆలోచనలో పడేస్తోంది.
పేరు గ్లామర్ ఓటర్ల జీవనం మధ్య భారీ తేడా ఉంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివసించే సినీ ప్రముఖులు రాజకీయ నాయకులు ఈ నియోజకవర్గ ఓటర్లు కారు. వారిలో అధిక శాతం ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఓటు వేస్తారు. ఉప ఎన్నికల్లో పాల్గొనే అవకాశం వారికి లేదు. ఈ నియోజకవర్గంలో వీఐపీలు అసలు లేరు. సాధారణ మధ్యతరగతి కుటుంబాలు నివసిస్తాయి. రోజువారీ సమస్యలు రోడ్లు డ్రైనేజీ నీటి కొరత వంటి అంశాలు వీరి జీవితంలో ముఖ్యం. గ్లామర్ పేరుతో సామాన్యుల గొంతుక బయటకు రావడం ఆసక్తికరం.
వాట్సాప్ నెంబర్ 94905 20108 కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 94905 20108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు