తన నిర్ణయంతో సీనియర్లకు చెక్ పెడుతున్న నారా లోకేశ్..? ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే..?

frame తన నిర్ణయంతో సీనియర్లకు చెక్ పెడుతున్న నారా లోకేశ్..? ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే..?

టీడీపీలో ప్రక్షాళనకు నారా లోకేశ్ నడుం బిగించినట్లు తెలుస్తోంది.  తన సంచలన నిర్ణయంతో  ఇప్పుడు సీనియర్లకు చెక్ పెట్టేశారు. ఇది నా సొంత నిర్ణయం అంటూ ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి సరికొత్త చర్చకు తెరలేపారు.  ఇంతకీ మ్యాటర్ ఏంటంటే..  పార్టీలో అందరికీ పదవులు రావాలి అని లోకేష్ విశాఖ పర్యటన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.


టీడీపీ జాతీయ కార్యవర్గంలో చూసుకుంటే అధినేత చంద్రబాబుని మినహాయిస్తే లోకేష్ అనేక సార్లు జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు.  జాతీయ కార్యదర్శి ఉపాధ్యక్షుడు వంటి పదవులు ఉన్నాయి. రాష్ట్ర కమిటీలలో ఇదే తరహాలో పదవులు ఉన్నాయి. వీటిలో చాలా మంది పదే పదే కొనసాగుతున్నారు. దీనిని మార్చాలని నారా లోకేష్ అంటున్నారు. తనతోనే ఆ సంస్కరణ జరగాలని ఆయన ఆశిస్తున్నారు.  ఈ నేపథ్యంలో ఆయన విశాఖలో చేసిన ఈ ప్రకటనతో టీడీపీలో చర్చ సాగుతోంది.


పార్టీలో మూడు సార్లు కీలక పదవులు చేసిన వారు తప్పుకుంటే కొత్త వారికి చాన్స్ దక్కుతుందని ఆయన అంటున్నారు.  అంతటితో ఆగకుండా ఈసారి తాను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకుంటానని సంచలన ప్రకటన చేశారు. తాను ఆ పదవి మళ్ళీ తీసుకోను అని అన్నారు.   ఇక లోకేష్ చెప్పిన దాని ప్రకారం చూస్తే పార్టీలో చాలా మార్పులకు ఇది నాంది పలకబోతోంది అని అంటున్నారు.  



అయితే ఇది తన సొంత అభిప్రాయం అని లోకేష్ అన్నారు.  పార్టీలో ఉన్న పెద్దలు అంతా చర్చించి దీని మీద నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఆయన అన్నారు అంటే అది పార్టీ కచ్చితంగా చర్చిస్తుంది. ఆ దిశగా కనుక నిర్ణయం తీసుకుంటే మాత్రం సీనియర్ నేతలు అంతా తప్పుకోవాల్సి ఉంటుంది అని అంటున్నారు.  సో ఇపుడు టీడీపీలో అదే జరగబోతోందా అన్నదే చర్చగా ఉంది. ఎలా అంటే టీడీపీలో పొలిట్ బ్యూరో మెంబర్స్ చాలా మంది ఉన్నారు. వారంతా పార్టీ పుట్టిన దగ్గర నుంచి ఉన్నారు. మరి వీరంతా స్వతాహాగా పదవి నుంచి తప్పుకుంటారా లేక సీనియర్లకు రెస్పెక్ట్ ఇచ్చి కొనసాగిస్తారా అన్నది చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: