వైసీపీకి ఆ కమ్మ ఎమ్మెల్సీ గుడ్ బై... ఎంపీ మధ్యవర్తిత్వంలో టీడీపీలోకి జంప్..?
ఆంధ్రప్రదేశ్లో వైసిపి ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు వరుసపెట్టి వైసిపికి ... ఆ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి కి జగన్‌కు షాకులు మీద షాకులు ఇస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీని నమ్ముకుంటూ వస్తున్న ఓ ఎమ్మెల్సీ సైతం వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఆయన సైకిల్ ఎక్కేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఆ నేత ఎవరో ? కాదు.. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే ... ప్రస్తుత వైసిపి ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్. వైసిపి ఆవిర్భావంతోనే ఆ పార్టీలోకి వెళ్లి ఉమ్మడి గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా పనిచేశారు మర్రి రాజశేఖర్. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో త్యాగాలు చేసిన ఆయనకు పార్టీ గెలిచే టైంలో 2019లో జగన్ సీటు ఇవ్వలేదు. మాజీ మంత్రి విడదల రజనీ కోసం రాజశేఖర్ ను పక్కన పెట్టిన జగన్ తాను ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్లో తరం పక్కన కూర్చోపెట్టుకుంటానని హామీ ఇచ్చారు.
జగన్ మర్రి రాజశేఖర్ ను నిలువునా మోసం చేశారు. చివరకు రజనీ ఒత్తిడికి తలవగ్గి ఎమ్మెల్సీ కూడా చివరి ఏడాదిలో మాత్రమే అయిష్టంగా ఇచ్చారు. ఇక పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా జగన్ రాజశేఖర్ ను స్వయంగా పిలిచి చిలకలూరిపేట ఇన్చార్జి పగ్గాలు ఇస్తానని చెప్పి మోసం చేసి తిరిగి విడదల రజనీకి చిలకలూరిపేట ఇన్చార్జి పగ్గాలు ఇచ్చారు. జగన్ తీరుతో 10 ఏళ్లకు పైగా వేచి చూసి విసిగిపోయిన రాజశేఖర్ ఎట్టకేలకు సైకిల్ ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు ... రాజశేఖర్ కు ఎంతో సాన్నిహిత్యం ఉంది. వైసీపీలో ఉన్నప్పుడు రాజశేఖర్ కు ఎమ్మెల్సీ ... మంత్రి పదవి కోసం లావు తనవంతుగా ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు కూడా లావు మధ్యవర్తిత్వంలోనే మర్రి టిడిపి గుటికి చేరిపోతున్నారు. 2029 ఎన్నికల టైం వరకు మర్రికి ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆ తర్వాత ఆయనకు మరోసారి ఎమ్మెల్సీ పొడిగించడం లేదా నియోజకవర్గాల పునర్విభజన తర్వాత ఎమ్మెల్యే సీటు ఇస్తామన్న అంశంపై ఆయనకు టీడీపీ అధిష్టానం నుంచి హామీ వచ్చినట్టు తెలిసింది.