చంద్రబాబు తీసుకున్న ఆ నిర్ణయం గేమ్ ఛేంజర్ అవుతుందా?
అధిక విద్యుత్ ఉత్పత్తి కోసం, వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరాను అందించేందుకు, విద్యుత్ సంస్థల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న ఉద్యోగులను మంత్రి గొట్టిపాటి రవికుమార్ అభినందించారు. ప్రభుత్వం విద్యుత్ శాఖను సంస్కరించే దిశగా అడుగులు వేసిందని, సంక్షోభం నుంచి సంక్షేమం దిశగా పయనించేందుకు ఎన్నో కార్యక్రమాలకు నాంది పలుకుతున్నట్టు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
త్వరలో ఏపీ ట్రాన్స్ కో రూ.15,729 కోట్ల విలువైన ప్రాజెక్టులను అమలు చేయనుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. దీని ద్వారా 71 సబ్ స్టేషన్లు, 16,507 ఎంవీఏ ట్రాన్స్ మిషన్ సామర్థ్యం, 4696 సీకేఎం టాన్స్మిషన్ లైన్స్ అందుబాటులోకి వస్తాయని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టుల రంగంలోకి ఏపీ జెన్కో అడుగుపెట్టిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు.
ఎగువ సీలేరులో 1350 మెగావాట్ల సామర్థ్యంతో సొంతంగా పి.ఎస్.పి. నిర్మించేందుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పీక్ లోడ్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని దశల వారీగా 5000 మెగావాట్ల సామర్థ్యంతో సంయుక్త భాగస్వామ్యంలో అయిదు పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎన్.హెచ్.పి.సి. తో ఎం.ఓ.యూ కుదుర్చుకోవడం ఏపీ విద్యుత్ రంగంలోనే కీలక ముందడుగని మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. మరి చంద్రబాబు తీసుకున్న క్లీన్ ఎనర్జీ పాలసీ నిజంగా అంతగా పెట్టుబడులు ఆకర్షిస్తుందా.. ఉపాధి అవకాశాలు కల్పిస్తుందా అన్నది ముందు ముందు తేలనుంది.