చంద్రబాబుని వదిలిపెట్టని ఏబీఎన్ ఆర్కే..? తీరిక లేదు.. దమ్మిడీ ఆదాయం లేదంటూ ప్రభుత్వంపై సెటైర్లు?

రాధాకృష్ణ జర్నలిజంలో బ్యూటీ ఏంటంటే.. స్వతహాగానే అతడు పాత్రికేయుడు.  క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయో బాగా తెలుసు. పైగా రాజకీయ నాయకులతో అతనికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉంటాయి.  వైసీపీ నాయకులలోనూ కొంతమంది రాధాకృష్ణకు అత్యంత సన్నిహితులంటే అతడి చాణక్యాన్ని అర్థం చేసుకోవచ్చు.  అందువల్లే తనకు తెలిసిన లోగుట్టును.. బహిర్గతం చేయడంలో రాధాకృష్ణ ఏమాత్రం వెనుకడుగు వేయడు.  పైగా తన పంచ్ ఆఫ్ రైటింగ్ తో అదరగొడుతుంటాడు.  



రాధాకృష్ణ రాసే కొత్త పలుకు వ్యాసంలో ఏదో ఒక కొత్తదనం ఉంటుంది.  సమాజంలోని ప్రజలకు తెలియని ఏదో ఒక విషయం దాగి ఉంటుంది.  ఈ వారం కొత్త పలుకులో చంద్రబాబు ప్రస్తావన మాత్రమే ఉంది.  అదికూడా ఆరు నెలల చంద్రబాబు పరిపాలనపై పోస్టుమార్టం నివేదిక లాగానే రాధాకృష్ణరాస్కొచ్చాడు. నాయకుడుంటే నరేంద్ర మోడీ లాగా ఉండాలని.. అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ లాగా ఎదిరించాలని చంద్రబాబుకు రాధాకృష్ణ హితబోధ చేశాడు.  



నరేంద్ర మోడీ ప్రశాంతంగా ఉంటారని.. చేయాల్సిన టైంలోనే పనులు చేస్తుంటారని.. అంతేతప్ప పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తో.. గంటల తరబడి కూర్చొని.. అధికారులను వేధించి ఇబ్బంది పెట్టరని రాధాకృష్ణ చెప్పుకొచ్చాడు. ముఖ్యమంత్రి అయినప్పటికీ చంద్రబాబులో పాతవాసనలు పోలేదని.. స్వర్ణాంధ్ర 2047 వంటి వాటితో ఉపయోగం లేదని.. భవిష్యత్తు ను మాత్రమే దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని రాధాకృష్ణ సూక్తి ముక్తావళిని వినిపించాడు.  ఇలా గంటల తరబడి అధికారులతో సమావేశాలు అంటూ.. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు అంటూ కాలయాపన చేస్తే “క్షణం తీరికలేకుండా.. దమ్మిడి ఆదాయం లేకుండా” వ్యవహారం సాగుతుందని రాధాకృష్ణ కుండ బద్దలు కొట్టాడు.



జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసిపి నాయకులు అక్రమాలకు పాల్పడ్డారని.. అన్యాయాలు చేశారని.. ఇప్పుడు కొంతమంది వైసీపీ నాయకులు టిడిపిలో చేరి అదే పంథాను కొనసాగిస్తున్నారని రాధాకృష్ణ వ్యాఖ్యానించాడు. ఇలా చంద్రబాబు పరిపాలన చుట్టూ మాత్రమే రాధాకృష్ణ పరిమితమయ్యాడు. చివర్లో విజయసాయి రెడ్డికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు.. చంద్రబాబునే చావాలని కోరుకుంటావా.. నువ్వు మనిషివేనా.. అంటూ శాపనార్ధాలు పెట్టాడు. మరి విజయసాయిరెడ్డి ఎలా స్పందిస్తాడో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

rk

సంబంధిత వార్తలు: