హెరాల్డ్ టాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీలు 2024 : అల్లు అర్జున్ వర్సెస్ పవన్ కళ్యాణ్ .. ఇప్పటికీ చల్లారని మంట..!

Amruth kumar
బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్, పుష్ప 2 సినిమాల‌తో తెలుగు సినీ పరిశ్ర‌మ ప్ర‌పంచ‌వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న విష‌యం తెలిసిందే. ఇండియాతో పాటు ప్ర‌స్తుతం వ‌ర‌ల్డ్ వైడ్‌గా టాప్‌లో ఉంది తెలుగు సినీ ఇండ‌స్ట్రీ. అయితే అగ్ర ప‌రిశ్ర‌మ‌గా ఒక వెలుగు వెలుగుతున్న టాలీవుడ్‌కి ఈ ఏడాది అస‌లు క‌లిసిరాలేద‌న్న విష‌యం తెలిసిందే.ఈ సంవత్సరం పలువురు అగ్ర హీరోలకు మాయని మచ్చగా మిగిలిపోయింది .. అలాంటి హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు .. 2021 లో వచ్చిన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న అల్లు అర్జున్ .. ఆ సినిమా తర్వాత పుష్పకు సిక్వల్గా పుష్ప 2 సినిమాలో దాదాపు నాలుగు సంవత్సరాలకు పైగా నటించి రీసెంట్గా పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అలాంటి అల్లు అర్జున్ కు ఈ 2024 సంవత్సరం ఆయన కెరియర్ లోనే ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టిన సంవత్సరంగా మిగిలింది..

ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ చేసిన రచ్చ‌ అంతా ఇంతా కాదు .. ఆ రచ్చతో మెగా కుటుంబం వర్సెస్ అలు ఫ్యామిలీ అనే విధంగా టాలీవుడ్ లో కొత్త చర్చకు తరలిపోయాడు .. ముఖ్యంగా ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిని కలిసి ఆయనకు మద్దతు ఇవ్వడం మెగా ఫ్యామిలీకి , మెగా అభిమానులకు జనసేన నాయకులకు అసలు నచ్చలేదు.. మెగా కుటుంబం మొత్తం ఒక తాటిపైకి వచ్చి పవన్ కళ్యాణ్ కు సపోర్టుగా నిలిస్తే. అల్లు అర్జున్ మాత్రం సపరేట్గా వైసీపీ చెంతన చేరాడు. ఈ వ్యవహారంతో అల్లు అర్జున్ పై మెగా అభిమానులు ఇప్పటికీ కోపం తగ్గలేదు .. అల్లు అర్జున్‌ గతంలో పవన్ కళ్యాణ్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా ఇందుకు ఆర్జం పోసాయి .. ఇదే క్రమంలో పుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిలిసిల‌ట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం తెలిసిందే ..

ఇక ఆ తర్వాత రోజు బెయిల్‌ రావడంతో ఆయన్ను రిలీజ్ చేశారు .. ఆ సమయంలో అల్లు అర్జున్ కు మెగా ఫ్యామిలీ చిరంజీవి నుంచి నాగబాబు వరకు ఎంతో సపోర్టుగా నిలిచారు .. తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి , నాగబాబుని కలిసి వారికి ధన్యవాదాలు కూడా తెలిపారు ..ఇదే క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాత్రం విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చిన అల్లు అర్జున్ ను కలవడానికి వెళ్లలేదు .. అర్జున్ అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ పెట్టిన ట్వీట్ కూడా ఎంతో వైరల్ గా మారింది. మెగా కుటుంబంలో ఉన్న మిగిలిన హీరోలు అల్లు అర్జున్‌తో కలిసిన పవన్ కళ్యాణ్ కు మాత్రం అల్లు అర్జున్ పేరు చెబితేనే మండిపోతుందని మరికొందరు అంటున్నారు .. అందుకే ఇప్పటికీ అల్లు అర్జున్ కలవడానికి పవన్ కు ఇష్టం లేదని అంటున్నారు .. ఇలా ఈ సంవత్సరం అల్లు అర్జున్ చేసిన  అనుకొని పనులతో 2024 సంవత్సరం ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: