ఈ మగోడు కష్టం ఎవరికీ రాకూడదు భయం..? ప్రతి ఒక్కరూ చదవాల్సిందే?
ఇప్పుడు మీరు చదవబోయే కథనం పూర్తి డిఫరెంట్. ఇందులో ఓ భార్య చేసిన పని వల్ల భర్త జీవితం తలకిందులైంది. చివరికి అతని ప్రాణం గాలిలో కలిసిపోయింది. అతని పేరు అతని పేరు అతుల్ సుభాష్. బెంగళూరులో ఉంటాడు. అక్కడ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. వేతనం భారీగానే ఉంటుంది. ప్రయోజనాలు కూడా భారీగానే వస్తుంటాయి. అతడికి గతంలో వివాహం చేసుకున్నాడు, పిల్లలు కూడా ఉన్నారు.
మొదట్లో అతడి సంసారం సజావుగానే సాగేది. కానీ ఆ తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. అతను సర్దుకుపోవడానికి ప్రయత్నించాడు. అయితే భార్య ఎంతకీ తగ్గలేదు. పైగా అతనితో గొడవను మరింత పెంచుకుంది. దీంతో అతను విడిపోవాలని నిర్ణయించుకున్నాడు. భార్య భారీగా భరణం కావాలని డిమాండ్ చేసింది. అతడికి వ్యతిరేకంగా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వరకట్న వేధింపులు, గృహహింస, లైంగిక బలత్కారం వంటి కేసులను పెట్టింది. వాటి ద్వారా అతడిని వేధించడం మొదలుపెట్టింది.
దీంతో అతడు ఆ వేధింపుల నుంచి తట్టుకోలేక ఏకంగా 24 పేజీల లేఖను పోలీసులకు, ఎన్జీవో లకు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు రాశాడు. ” న్యాయం, అన్యాయం ఏమిటో తెలియకుండానే జరిగింది ఏమిటో చెప్పేస్తున్నారు. చట్టం కూడా ఆమెకే అనుకూలంగా ఉంది. పిల్లల తరఫున ఎక్కువ భరణం ఇవ్వాలని ఆమె వేధిస్తున్నది. విసిగిపోయాను. తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాను. మానసికంగా సంతోషం లేదు. నేను బతకడంలో అర్థం లేదని” అతడు ఆ వీడియో సందేశం లో పేర్కొన్నాడు.
తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే తను పడుతున్న ఆవేదనను వీడియో రూపంలో అతడు చెప్పడం హృదయ విదారకంగా ఉంది. ఆ వీడియో సామాజిక మాధ్యమాలలో సంచలనంగా మారింది. అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకోవడం సంచలనంగా మారింది. అతనికి న్యాయం చేయాలని సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. #justiceforAtulSubhash అనే యాష్ తెగ ట్రెండ్ అవుతున్నది. ఈ యాష్ ట్యాగ్ తో నెటి జన్లు తెగ పోస్టులు పెడుతున్నారు.