ఆ విషయంలో మోపిదేవికి తీవ్ర అన్యాయం..!మిగతా ఇద్దరికీ లైన్ క్లియర్?
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ సీట్లకు కూటమి అభ్యర్ధులు ఖరారు అయ్యారు. బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ క్రిష్ణయ్యలు వైసీపీకి తన ఎంపీ పదవికీ గుడ్ బై చెప్పారు. దాంతో ఏపీ నుంచి మూడు రాజ్యసభ సీట్లకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ సీట్లలో పోటీ చేసేందుకు చాలా మంది అభ్యర్ధులు రేసులోకి వచ్చారు.
మెగా బ్రదర్ నాగబాబు ఈసారి పక్కాగా రాజ్యసభకు వెళ్తారు అని అంతా అనుకున్నారు. మాజీ ఎంపీ గల్లా జయదేవ్, మాజీ మంత్రి యనమల రామక్రిష్ణుడు, వర్ల రామయ్య, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి ఇలా ఎన్నో పేర్లు వినిపించాయి.
చివరకు బీజేపీ నుంచి ఆర్ క్రిష్ణయ్య, టీడీపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్ లను ఎంపిక చేశారు. దాంతో టీడీపీ కూటమి తరఫున ఎవరు రాజ్యసభకు వెళ్తారు అన్న ఉత్కంఠకు తెర పడింది. ఈ ముగ్గురూ తమ నామినేషన్లు దాఖలు చేయనున్నారు. వైసీపీ నుంచి రాజీనామాలు చేసి బయటకు వచ్చిన ముగ్గురు ఎంపీలలో తిరిగి ఇద్దరు మళ్లీ రాజ్యసభ మెట్లెక్కుతున్నారు. వారే బీద మస్తాన్ రావు, ఆర్ క్రిష్ణయ్య, బీద టీడీపీ నుంచి, ఆర్ క్రిష్ణయ్య బీజేపీ నుంచి తన మిగిలిన పదవీ కాలానికి కొనసాగడానికి నామినేట్ అవుతున్నారు.
అయితే మోపిదేవికే ఆ చాన్స్ దక్కలేదు. ఆయన ప్లేస్ లో సానా సతీష్ ని ఎంపిక చేశారు. మోపిదేవికి ఎమ్మెల్సీ ఇస్తారని ప్రచారం సాగుతోంది. ఏపీ శాసనమండలిలో నలుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేస్తే వారి రాజీనామాలను మండలి చైర్మన్ ఆమోదించలేదు. దీంతో అక్కడ ఎప్పుడు ఖాళీలు ఏర్పడతాయి.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి. మోపిదేవికి చాన్స్ వస్తుంది అన్నది అయితే తెలియదు అంటున్నారు
2026 జూన్ వరకూ పెద్దల సభలో పదవీకాలం ఉన్న మోపిదేవి టీడీపీ అధినాయకత్వం తో ఏమి మాట్లాడుకుని రాజీనామా చేశారో కానీ ప్రస్తుతానికి అయితే ఆయన ఖాళీగానే ఉన్నారని అంటున్నారు. పైగా ఆయన సొంత నియోజకవర్గం రేపల్లెలో రెవిన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ బలమైన నాయకుడు. ఆయనను కాదని మోపిదేవికి పార్టీ చాన్స్ ఇచ్చి ముందుకు తీసుకుని వెళ్తుందా అన్నదే చర్చగా ఉంది.