టీడీపీలో కలకలం.. చంద్రబాబుపై బీసీ బాణం ఎక్కుపెట్టిన యనమల..?
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు టీడీపీ మీద బీసీ బాణం సంధించారు. కులాల పేర్లు పెట్టి మరీ బీసీలకు అన్యాయం జరుగుతోంది అని ఆయన గట్టిగా గుచ్చేశారు. ఇది ఇపుడు టీడీపీతో పాటుగా బలమైన సామాజిక వర్గాలలోనూ చర్చ సాగుతోంది. ప్రత్యేకించి కమ్మ కులం వారి వెనక చౌదరి అంటూ ట్యాగ్ తగిలించి మరీ ఆయన చంద్రబాబుకు రాసిన లేఖ వెనక ఆంతర్యం ఏమిటి అన్నది హాట్ హాట్ డిస్కషన్ గా మారింది.
నిజానికి చూస్తే యనమలను అంతా పెద్ద మనిషిగా భావిస్తారు. ఆయన టీడీపీ పుట్టినప్పటి నుంచి అందులో ఉన్నారు. ఈ సారి ఎన్నికల్లో ఆయన కుమార్తెకు టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేశారు. ప్రభుత్వ విప్ పదవి దక్కింది. యనమలకు ఎమ్మెల్సీ పదవి ఉంది. ఆయన అల్లుడికి ఎంపీ సీటు ఇచ్చారు, వియ్యంకుడికి పదవి ఉంది. ఇలా అన్ని రకాలుగా టీడీపీలో పూర్తిగానే యనమలకు న్యాయం జరిగింది అని అంటున్నారు.
అటువంటిది యనమల కాకినాడ పోర్టు విషయంలో బీసీలకే తీవ్ర అన్యాయం జరిగిందని. వారి భూములు తీసుకుని దశాబ్దాలుగా న్యాయం చేయడం లేదని కూటమి ప్రభుత్వానికి లేఖను సంధించడంతో అంతరార్ధం ఏమిటి అని అడుగుతున్నారు. ఆయన రాసిన లేఖలో కేవీ రావుని చౌదరి అని అలాగే మురళీ చౌదరి అని ప్రత్యేకంగా ట్యాగ్ పెట్టి మరీ రాయడం పట్ల అయితే అంతా చర్చిస్తున్నారు. కేవీ రావు కానీ మురళీ కానీ ఎపుడూ తమ పేరు చివరి కులం ట్యాగ్ పెట్టుకోలేదని మరి యనమల లేఖలో అలా రాయడం వెనక ఉద్దేశ్యం ఏమిటి అన్నది కూడా చర్చిస్తున్నారు.
బీసీల పక్కన ఎపుడూ మాట్లాడని యనమల ఈ రోజు మాట్లాడమేంటని ఆయన అన్నారు. కాకినాడ ఎస్సీ జెడ్ చంద్రబాబు ఆరు నెలల పాలనలోనే వచ్చిందా అని అంటున్నారు. నాడు వైఎస్సార్ మీద బీసీలకు అన్యాయం అంటూ ఎందుకు పోరాటం చేయలేదని నిలదీస్తున్నారు. బీసీలలో యనమల బిగ్ షాట్ కాదా అని ప్రశ్నిస్తున్నారు. యనమల రాజకీయాల్లోకి వచ్చినపుడు ఈ రోజుకు ఉన్న ఆస్తులు ఎన్ని అని రాజకీయ విశ్లేషకులు సుంకర వెంకటేశ్వరరావు ఒక యూట్యూబ్ చానల్ డిబేట్ లో గట్టిగానే కౌంటర్లు ఇచ్చారు.