. ట్రంప్ ఓడితే అమెరికాలో రచ్చ రచ్చే నా? ఇంతకీ ఏం ప్లాన్ చేశాడంటే?

అమెరికా ఎన్నికలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మధ్య పోటీ నెక్ టు నెక్ అన్నట్లుగా జరుగుతోంది. అటు సర్వేలు సైతం అవే వెల్లడిస్తున్నాయి. ఓటర్లు సైతం ఎవరి వైపు నిలుస్తున్నారా అని అర్థం కాకుండానే ఉంది. సర్వేలకు కూడా అంచనా దొరకడం లేదు.


ఇదే క్రమంలో ఒకవేళ ట్రంప్ కనుక ఓడిపోతే పరిస్థితి ఏంటన్న చర్చ నెట్టింట జరుగుతోంది. ట్రంప్ అంటేనే ఓ కాంట్రవర్సీ. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడుతాడో కనీసం ఆయనకే తెలియదు.  అంతేకాదు.. ప్రజలను ఆకట్టుకోవడంలో, ప్రత్యర్థులకు చుక్కలు చూపించడంలోనూ ఆయన పంథా వేరు.


ఒకవేళ ఈసారి కూడా ఫలితాలు తారుమారై ట్రంప్‌ ఓడిపోతే పరిస్థితి ఏంటనేది అంచనా వేయకుండా ఉంది.  ఓటమిని ట్రంప్ అంత ఈజీగా అంగీకరిస్తారా.. అన్న చర్చ సైతం నడుస్తోంది. నవంబరు  5న జరిగే ఎన్నికల్లో హారిస్‌పై గెలవకుంటే ఫలితాలను అంగీకరించేదే లేదని ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఒకవేళ కనుక మనం ఓడిపోతే ప్రత్యర్థులు మోసం చేసినట్లే భావించాలని మద్దతుదార్లతో చెప్పుకొచ్చారు.


దీంతో ఫలితాల వేళ ట్రంప్ ఏం చేయబోతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఒకవేళ ఓటమి పాలైతే ఫలితాలను వివాదాస్పదం చేసేందుకు కూడా ట్రంప్ రెడీ అయిపోయారట. న్యాయస్థానాలను ఆశ్రయించేందుకు అన్ని రకాల సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది.  ఓటర్లు కాని వారు ఓట్లేస్తున్నారని ఆరోపించారు. అటు ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా ఈ ప్రచారంలో చాలా వరకు ముందు ఉన్నారు. ట్రంప్ కోసం ఆయన 'ఎక్స్' ఓ స్థాయిలో వినియోగిస్తున్నారు.


మరోవైపు.. ఓట్ల లెక్కింపు కోసం కూడా ట్రంప్ వేల మందిని రెడీ చేశారట. వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. ఫలితాలు ఒకవేళ తేడాగా వస్తే ఏం చేయాలో కూడా వారికి శిక్షణ ఇస్తున్నారు. ఇంతలోనే ఇటీవల బ్యాలెట్ బాక్సులకు నిప్పులు పెట్టడం కూడా చూశాం. ఆ పని ఎవరు చేసినప్పటికీ ఫలితాల వేళ మాత్రం అమెరికాలో పరిస్థితులు ఎంత దారుణంగా ఉండబోతున్నాయో ఇప్పుడే అర్థం అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: