జగన్ అక్కడకి వెళ్తారు అనుకుంటే.. పవన్ వెళ్లారే? ఈ ట్విస్ట్ వైసీపీ ఊహించనేలేదు?

గత వారం నుంచి ఉత్తరాంధ్రను వణికిస్తున్న అతిసార కేసులు విజయనగరం జిల్లా గుర్ల మండలంలో చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటకి అయితే పన్నెండు మంది దాకా అతిసారాతో మరణించారు అని అంచనా. వందమందికి పైగా ఆసుపత్రి పాలయ్యారు. ఇంకా వీరి సంఖ్య అధికంగా ఉండొచ్చనే అభిప్రాయమూ ఉంది.


అతిసారా కేసులతో ఏకంగా మరణాలు సంభవించడం అంటే కూడా ఆశ్చర్యమే అంటున్నారు.  విజయనగరం జిల్లా కేంద్రానికి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి కూడా రక్షిత మంచినీరు అందించడం జరగడం లేదా అన్న చర్చ కూడా సాగుతోంది.  ఇది పాలకుల ఉదాశీనత అలాగే అధికారుల నిర్లక్ష్యం అని చెబుతున్నారు. ప్రజలకు కనీస అవసరం అయిన రక్షిత మంచినీటిని అందించలేకపోవడం కంటే దారుణం వేరొకటి ఉండదని పలువురు అభిప్రాయపడుతున్నారు.


గుర్లలో అతిసారా కేసుల విషయంలో ప్రభుత్వమే కాదు ప్రతిపక్షమూ ఆలస్యంగానే స్పందించింది అని అంటున్నారు.  జిల్లాకు చెందిన మాజీ మంత్రి శాసన మండలిలో ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఏకంగా మరణాలు పెరుగుతున్న వేళ విశాఖలో ప్రెస్ మీట్ పెట్టి ఈ మరణాలకు సర్కార్ వైఫల్యమే కారణం అని విమర్శించారు.


మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుర్ల మండలానికి వెళ్ళి అతిసారా మరణాలకు గత ప్రభుత్వం వైఖరే కారణం అన్నారు.  వ్యవస్థలను మొత్తం పాడు చేయడం వల్లనే ఈ పరిస్థితి అని ఆయన అంటున్నారు ఈ విధంగా ఆరొపణలు ప్రత్యారోపణలు జరుగుతున్న వేళ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుర్ల మండలానికి సోమవారం వెళ్తున్నారు.  


ఆయన అతిసారా బాధిత కుటుంబాలను పరామర్శిస్తారు అని అంటున్నారు. అంతే కాదు ఆయన అక్కడ పరిస్థితులు తెలుసుకుని అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేస్తారు అని అంటున్నారు మామూలుగా అక్కడికి ప్రతిపక్షం వెళ్ళి వాలాలి.  విపక్ష నేత జగన్ ఎందుకో ట్వీట్ మాత్రమే చేసి వదిలిపెట్టారు. దాంతో జగన్ వెళ్లాల్సిన చోటకు పవన్ వెళ్తున్నారు అని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: