తెలంగాణ నెక్స్ట్ సీఎం ఎవరో చెప్పిన ప్రముఖ జ్యోతిష్యుడు..? పార్టీ శ్రేణుల్లో జోష్?

పదేళ్ల అధికారానికి దూరమైన, లోక్ సభ ఎన్నికల్లో సున్నా స్థానానికే పరిమితం అయినా, పార్టీ నుంచి జారిపోతున్న నేతలను కాపాడుకోలేక, పార్టీలో గ్రూపు రాజకీయాలను అదుపు చేయలేక సతమతం అవుతుంది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్.


2023 అసెంబ్లీ ఎన్నికల్లో 39 స్థానాలు గెలుచుకున్న బీఆర్ఎస్ ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది.  అసెంబ్లీ ఎన్నికలయ్యాక మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌(KCR) బాత్‌రూంలో జారి పడటం, ఆయన తుంటి ఎముక విరిగి 3 నెలలకుపైగా విశ్రాంతి తీసుకోవడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఒక్కసారిగా నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయారు.  10 మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్‌లోకి జంప్ కావడంతో శ్రేణులు మరింతగా డీలా పడ్డారు.  


ఇన్నాళ్లు రాజకీయంగా కష్టాలు ఎదుర్కొంటున్న కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు రానున్న రోజుల్లో మహర్దశ పట్టనుందని ప్రముఖ జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని జాతకం చెప్పారు. ఆయనకు త్వరలో శుభ గడియలు ప్రారంభం కానున్నాయని అన్నారు. కేసీఆర్‌కు ప్రస్తుతం రాహు కాలం కొనసాగుతోందని.. త్వరలోనే ఆయనకు కాలం కలిసి వస్తుందని పేర్కొన్నారు. పరిస్థితులు కలిసి వచ్చి కేసీఆర్‌కు రాజయోగం కలగనుందని విశ్లేషించారు.



ఈ మేరకు ఆయన్ ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చెప్పే జోతిష్యాలు ప్రాచుర్యం పొందాయి. ప్రశాంత్‌కు.. ఎక్స్‌లో 52 వేల మంది ఫాలోవర్లు ఉన్నారు. కేసీఆర్‌ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉంది? భవిష్యత్‌లో ఎలా ఉండబోతున్నదనే విషయాలను తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేశారు. ఆ పోస్ట్‌ నెట్టింట్లో తెగ వైరల్‌గా మారింది. దీన్ని లక్ష మందికిపైగా చూశారు.


ప్రశాంత్ కిని డిసెంబరు 14, 2023లో ఎక్స్‌లో ఓ పోస్ట్ పెట్టారు. బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తి ప్రధాని హసినా పదవీచ్యుతురాలు అవుతారని అందులో పేర్కొన్నారు.  అంచనాలకు తగినట్లే బంగ్లాలో సంక్షోభం చోటుచేసుకుంది.  ఈ ఏడాది వయనాడ్‌లో కొండ చరియలు విరిగిపడిన ఘటనను ప్రశాంత్ కిని ముందే అంచనా వేశారు.


కేసీఆర్ రాజకీయ ప్రయాణంపై కూడా ప్రశాంత్ పాజిటీవ్‌గా జోస్యం చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణులు ఫుల్ ఖుషీలో ఉన్నాయి. కేసీఆర్‌ మళ్లీ సీఎం అవుతారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr

సంబంధిత వార్తలు: