ఒక్కసారిగా పార్టీ గేట్లు క్లోజ్ చేసిన చంద్రబాబు? వ్యూహం అదే నా?

వైసీపీ నుంచి చేరికలు ఆగాయా? లేకుంటే చంద్రబాబు ఆపారా ? ఈ విషయంలో ఒక వ్యూహం ప్రకారం ముందుకు వెళ్తున్నారా? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయింది. దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. కనీసం ప్రతిపక్ష హోదా దక్కలేదు. పార్టీకి భవిష్యత్తు లేదని భావిస్తున్న నేతలు ఒక్కొక్కరు గుడ్ బై చెబుతున్నారు.  


పార్టీని వీడుతున్న వారు కొద్దిమంది మాత్రమే టీడీపీలో చేరారు.  ఎమ్మెల్సీలు కూడా పదవికి రాజీనామా చేశారు. ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా గుడ్ బై చెప్పారు.  ఇందులో ఒకరిద్దరు మాత్రమే టిడిపిలో చేరారు. మరో ఇద్దరు ముగ్గురు జనసేనలో చేరారు. అయితే వారిని వ్యూహాత్మకంగానే ఏ పార్టీలో చేర్చలేదని తెలుస్తోంది. కానీ వారిని వైసీపీ నుంచి దూరం చేయడంలో మాత్రం ఏదో వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రధానంగా ప్రభుత్వంపై వైసిపి దాడి చేసినప్పుడు, ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలని ప్రయత్నించినప్పుడు.. చేరికలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని తెలుస్తోంది.  వాస్తవానికి వైసీపీపై చాలామంది అసంతృప్తితో ఉన్నారు.  అటువంటివారు పొలిటికల్ గా సైలెంట్ అయ్యారు. కొద్దికాలం వేచి ఉండి తర్వాత నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు.  


వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ల ఎంపిక ఆ పార్టీ వైఖరిని తెలియజేస్తోంది. పార్టీలో చాలామంది సీనియర్లు ఉన్నారు.  కానీ వారిని రీజినల్ కోఆర్డినేటర్లుగా ఎంపిక చేయలేదు. తన సామాజిక వర్గానికి చెందిన ఏకంగా ఐదుగురిని ఆ పదవులు ఇచ్చారు జగన్. గోదావరి జిల్లాల్లో జనసేన ప్రభావం అధికంగా ఉన్న దృష్ట్యా సీనియర్ నేత అయిన బొత్సను ప్రయోగించారు. అయితే ఇతర సామాజిక వర్గ నేతలను జగన్ నమ్మడం లేదని వైసీపీలో ప్రచారం సాగుతోంది.  


అయితే మున్ముందు ఇతర సామాజిక వర్గాలకు చెందిన వైసిపి నేతలు పార్టీని వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైసీపీ అధినేత జగన్ తీరు ఇలానే కొనసాగితే మాత్రం.. ఎక్కువమంది కీలక నిర్ణయం దిశగా అడుగులు వేసే అవకాశం ఉంది.  చేరికల విషయంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా వ్యవహరించడం వల్లే వైసీపీ సేఫ్ జోన్ లో ఉందని.. లేకుంటే ఆ పార్టీ ఖాళీ అయిపోతుందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: