గురు శిష్యులని ఓటుకు నోటు కేసు కట్టడి చేస్తుందా?

ఎప్పటి ఓటుకు నోటు కేసు. అలా కాలాన్ని పెంచుకొని మరీ ముందుకు పాములూ సాగుతూ వస్తోంది. 2015 జూన్ నెలలో జరిగిన వ్యవహారం అది. అప్పటికే ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లో నాటి సీఎం చంద్రబాబు తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం తన పార్టీలో ఆనాడు కీలకంగా ఉన్న రేవంత్ రెడ్డిని ప్రయోగించారు అన్నది ఈ కేసు వెనుకు ఫ్లాష్ బ్యాక్.


అయితే ఓటుకు నోటు కేసు వ్యవహారం అప్పట్లో కొంత చల్లారింది అనుకున్నా అది ఇంకా కొనసాగుతూనే ఉంది. బ్రీఫ్ట్ మీ అన్న గొంతుక చంద్రబాబుదే అని వైసీపీ నేతలు ఆరోపించారు. దీని మీద వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీం కోర్టు వరకు వెళ్లినా ఫలితం దక్కలేదు.


అయితే ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం విచారణను ఎదుర్కొంటున్నారు. లేటెస్ట్ గా చూస్తే ఈ కేసు తాజా విచారణ వాయిదా పడింది. అయితే రేవంత్ రెడ్డి ఈ కేసులో విచారణలో ఉన్నా అది ఇన్ డైరెక్ట్ గా టీడీపీ మీద చంద్రబాబు మీద ప్రభావం చూపిస్తుందని అంటున్నారు. అలా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ ఓటుకు నోటు కేసులో ఉన్నారనే అంటున్నారు.


ఈ ఇద్దరూ వేరు వేరు పార్టీలు అయినా కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటంతోదానికి భయపడుతున్నారు అని అంటున్నారు విశ్లేషకులు. ఏపీలో టీడీపీకి బీజేపీతో పొత్తు ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ని నేరుగా బీజేపీ ఢీకొంటోంది. కానీ రాజకీయాల్లో చాలా కోణాలు ఉన్నాయని అంటున్నారు. ఇక ఓటుకు నోటు కేసు ఒక పట్టాన తెమలదు. ఈ కేసు సాగుతున్నంత కాలం ఈ ఇద్దరూ సీఎంలు బీజేపీకి లొంగి ఉండాలని అంటున్నారు. ఎందుకు అంటే దేశంలో అందరికీ ఈ కేసు పూర్వాపరాలు తెలుసు. అందుకే ఇద్దరూ సీఎంలు బీజేపీ పై సాఫ్ట్ కాన్నర్ తో ఉంటున్నారా అంటే విపక్షాలు అయితే అలాగే అంటాయి. కానీ పీత బాధలు పీతవి.. సీత బాధలు సీతవి అన్నట్లు రాజకీయాల్లో ఎవరి సమస్యలు వారికి ఉంటాయి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: