జగన్ కలల ప్యాలెస్ ని పట్టించుకోని కూటమి ప్రభుత్వం? రోజుకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

విశాఖ రుషికొండ భవనాల విషయంలో కూటమి ప్రభుత్వం నిర్ణయం ఏంటి? ప్రభుత్వ భవనంగా వినియోగిస్తారా? ప్రైవేటుకు అప్పగిస్తారా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలులు అవుతోంది. ప్రభుత్వ పరంగా చాలా వరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కానీ రుషికొండ విషయంలో మాత్రం ఇంత వరకు ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు.


కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రుషికొండ కట్టడాలు వెలుగులోకి వచ్చాయి. అప్టపి వరకు గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు కొనసాగాయి. కానీ స్థానిక శాసన సభ్యుడి హోదాలో గంటా శ్రీనివాసరావు ప్రత్యేకంగా తన బృందంతో రుషికొండను సందర్శించారు. అక్కడ ఖరీదైన నిర్మాణాలను బయట పెట్టారు. మీడియాలో ఈ అంశం హాట్ టాపిక్ అయింది. దాదాపు రూ.500 కోట్లతో నిర్మించిన ఈ భవనాల్లో ప్రతి నిర్మాణం అద్భుతమే.


అయితే వీటి విషయంలో కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయం తీసుకుటుందని ప్రచారం సాగింది. కానీ నెలలు గడుస్తున్నా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్, మంత్రి నారా లోకేశ్ విశాఖలో పర్యటించినా రుషికొండ వైపు  చూడలేదు. దాని గురించి పల్తెత్తు మాట కూడా మాట్లాడలేదు. ఇక సీఎం చంద్రబాబు సైతం పర్యాటక శాఖతో పలుమార్లు సమీక్షలు జరిపారు. కానీ రుషికొండ టాపిక్ మాత్రం ఆయన దృష్టికి రాలేదు.


మరి ఈ భవనాలను ఎలా వినియోగిస్తారు అనేది ప్రశ్నార్థంకగా మారింది. రుషికొండపై 9.88 ఎకరాల్లో సువిశాలమైన భవనాలు నిర్మించారు. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన వీటి నిర్వహణకు 100 మంది వరకు సిబ్బంది అవసరం. మరో 50 మంది షిప్టుల్లో పనిచేయాలి. నెలగు సగటున రూ.6లక్షల వరకు విద్యుత్తు బిల్లులు వస్తున్నాయని అక్కడి సిబ్బంది చెబుతున్నారు. రోజుకు సగటున రూ.లక్ష వరకు ఖర్చు దాటుతుందని.. ఏడాదికి రూ.4 కోట్ల భారం పడుతుందని అధికార వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ నాలుగు నెలల్లో నిర్వహణకు దాదాపు రూ.50లక్షల వరకు ఖర్చు అయినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: