పవన్ ట్విస్ట్ తో బాబు బెంబేలు, జగన్ ఫుల్ హ్యాపీ?

తిరుమలలో వివాదంపై  ఆది నుంచి  డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దూకుడగానే ఉన్నారు. వైసీపీ ప్రభుత్వ చర్యలను తప్పు పట్టారు. అప్పటి టీటీడీ ట్రస్ట్ బోర్డులపై విరుచుకుపడ్డారు. ఎన్డీయే శాసన సభ పక్ష సమావేశంలో చంద్రబాబు తిరుపతి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని సంచలన ప్రకటన చేశారు. వైసీపీ హయాంలోనే ఈ పాపం జరిగిందని ఆరోపించారు.


ఇక దీనిపై స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు పవన్ కల్యాణ్. దేశంలోనే సనాతన ధర్మ పరిరక్షణకు పటిష్ఠమైన వ్యవస్థ కావాలని అభిప్రాయపడ్డారు. దీనిపై హిందూ సమాజం అలోచన చేయాలని కోరారు. దఅయితే ఎక్కువ మందిని దీనిని ఆహ్వానించారు. చాలా మంది దీనిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అయినా పవన్ పట్టించుకోలేదు. ఈ ఘటనను నిరసిస్తూ ఏకంగా ప్రాయశ్చిత్త దీక్షకు దిగారు. 11 రోజుల పాటు దీనిని కొనసాగించారు. అందులో భాగంగా విజయవాడలోని దుర్గమ్మ అమ్మవారి మెట్లను శుభ్ర పరిచి తనదైన రీతిలో నిరసన తెలిపారు.


ఇక తాజాగా తిరుపతిలో వారాహి సభను నిర్వహించి డిక్లరేషన్ లోని ముఖ్యాంశాలను వివరించారు. గత ప్రభుత్వం లడ్డూ ప్రసాదం కలిపి చాలా చిన్న విషయంగా పేర్కొన్నారు. గుమ్మడి కాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నారంటూ వైసీపీ నేతలను విమర్శించారు. ఈ అంశంపై దర్యాప్తు చేయమంటే రాజకీయాలు చేస్తున్నారంటూ ఆరోపించడం సబబు కాదన్నారు. ఈ విషయంలో జగన్ ది తప్పు కాదన్నట్లు వ్యవహరించారు.


ఇటీవల సుప్రీం కోర్టు సీఎం చంద్రబాబు వ్యవహార శైలిని తప్పు పట్టిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో పవన్ వ్యాఖ్యలు వేరే అర్థం వచ్చేలా ఉన్నాయి. జగన్ ది తప్పుకాదు.. కోర్టులు  స్పందిస్తున్న తీరు తప్పు అనేలా ఆయన మాటలు ధ్వనించాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాను వైసీపీ ప్రభుత్వ వైఖరి గురించి మాట్లాడటం లేదని.. కేవలం టీటీడీ వైఫల్యాలపై మాత్రమే వ్యాఖ్యానించానని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం పవన్ కామెంట్లు మాత్రం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: