కేసీఆర్ కావాలంటున్న ప్రజలు? వాల్యూ ఇప్పుడు తెలిసి వచ్చిందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి పది నెలలు కావొస్తోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 65 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక అధికార బీఆర్ఎస్ 39 సీట్లకు పరిమితం అయింది. అయితే కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ సీఎం కేసీఆర్ ఫాం హౌస్ కే పరిమితం అయ్యారు. పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఫామ్ హౌజ్ లో కాలుజారి పడటంతో తుంటి ఎముక విరిగింది.


ఆపరేషన్ తర్వాత మూడు నాలుగు నెలలు బెడ్ కే పరిమితం అయ్యారు. లోక్ సభ ఎన్నికల వేళ చేతి కర్ర సాయంతో తెలంగాణ భవన్ కు వచ్చారు. పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. లోక్ సభ ఎన్నికలకు సమయాత్తం కావాలని సూచించారు. ఎన్నికల ప్రచారం పై దిశానిర్దేశం చేసి.. బస్సు యాత్రం చేపట్టారు. అయినా కేసీఆర్ ఆశించిన ఫలితం రాలేదు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నేతలంగా కాంగ్రెస్ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే పది మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.


ఇదిలా ఉంటే.. అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేసేందుకు ఇబ్బందులు పడుతోంది. ఈ క్రమంలో అధికార పార్టీపై వ్యతిరేకత పెరుగుతోంది. ఇక హైదరాబాద్ వాసుల్లో అయితే ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది. ముఖ్యంగా హైడ్రా బాధితులు, మూసీ ప్రక్షాళన కారణంగా బలవంతంగా ఇళ్లను ఖాళీ చేస్తున్న బాధితులు కాంగ్రెస్ సర్కారు పై మండి పడుతున్నారు.


ఇదిలా ఉంటే గ్రామాల్లో రైతులు కేసీఆర్ ను గుర్తు చేసుకుంటున్నారు. రుణమాఫీ హామీ నెరవేరకపోగా.. రైతుబంధు ఆగిపోయింది. రైతు భరోసా కింత ఇస్తామన్నా రూ.7500 రావడం లేదు. వానాకాలం పూర్తి కావొస్తున్నా పెట్టుబడి సాయం ఇవ్వలేదు. ఇక పెంచుతా అన్న పింఛన్ సైతం పెంచలేదు. దీంతో వృద్ధులు, రైతులు కేసీఆర్ కు అనుకూలంగా మాట్లాడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ నే గెలపించుకుంటామని చెబుతున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక కాంగ్రెస్ వచ్చాక తమకు కష్టాలు పెరిగాయని.. కేసీఆరే మళ్లీ రావాలని కొందరు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: