ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి అవుట్? ఆమె ప్లేస్ లోకి మాజీ సీఎం..?

ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి మార్పు ఖాయమా? ఆమెను మార్చుతారా? అక్టోబరులో ఉద్వాసన పలకనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా ఈ అనుమానాలకు బలం చేకూరుస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులను నియమించేందుకు బీజేపీ హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.


గత ఏడాది జులైలో పురంధేశ్వరి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమితులయ్యారు. అప్పట్లో టీడీపీ, బీజేపీ దూరంగా ఉండేవి. చంద్రబాబుకి చెక్ చెప్పేందుకు పురంధేశ్వరిని నియమించారని అప్పట్లో ప్రచారం సాగింది. అయితే అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న ఆమె ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేశారు. నాటి సీఎం జగన్ పై విమర్శలు చేసేవారు. టీడీపీపై ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబుని పల్లెత్తు మాట కూడా అనలేదు. ఒక విధంగా చెప్పాలంటే బీజేపీ హైకమాండ్ ను పొత్తుకు ఒప్పించారు ఆమె. అధ్యక్ష స్థానంలో ఆమె కాకుండా ఇతరులు ఎవరు ఉన్నా టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకునే ప్రసక్తే లేదన్న కామెంట్లు కూడా వినిపించాయి.


అయితే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రెండేళ్లు. ఇంకా తొమ్మిది నెలల వ్యవధి ఉంది. అయితే పురంధేశ్వరిని మార్చాలన్నా డిమాండ్ ఏపీ నుంచి ప్రధానంగా వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెపై బీజేపీ సీనియర్లు చాలా మంది ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. బీజేపీలో వర్గ విభేదాలు కామన్. ఏపీలో పార్టీ అభివద్ధి చెందకపోవడానికి అదే ప్రధాన కారణం. ఎన్నికల్లో పొత్తులో భాగంగా ఎనిమిది అసెంబ్లీ సీట్లను సొంతం చేసుకుంది బీజేపీ. ఆరు ఎంపీలకు పోటీ చేసి మూడింటిని గెలుచుకుంది.


ఒంటరిగా పోటీ చేస్తే ఇంతటి విజయం దక్కేది కాదన్నది విశ్లేషకులు అభిప్రాయం. ఐదేళ్ల కాలంలో పార్టీ క్షేత్ర స్థాయిలో బలపడింది లేదు. ఈ నేపథ్యంలో చాలా మంది సీనియర్లు ఆమెపై అధిష్ఠానానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో చాలా రోజుల నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని అప్పగిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. అక్టోబరులో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరిస్తారని చెబుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: