జగన్ కి మేలు చేసిన చంద్రబాబు? వైసీపీని ఏకతాటిపైకి తెచ్చారుగా..!
సరిగ్గా వంద రోజులు.. ఏపీ రాజకీయాల్లో ఎన్నో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. పార్టీ ఓటమి పాలవ్వడంతో కొందరు పార్టీకి, నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. మరికొందరు కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, కాకాణి గోవర్ధన్, పేర్ని నాని లాంటి వాళ్లు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు.
ఆరు నెలల వరకు నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు తిరిగే ప్రసక్తే లేదని ప్రచారం నడిచింది. కానీ అనూహ్యంగా వైసీపీ నేతలు మీడియా మందుకు వచ్చారు. చంద్రబాబుని తూర్పారపడుతున్నారు. వైసీపీ హయాంలో తిరుమల లడ్డూ కత్తీ నెయ్యితో తయారు చేశారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీనిపై వైసీపీనే టార్గెట్ చేసి నేతలు గట్టిగా విమర్శిస్తున్నారు. ఇక వైసీపీ కూడా గట్టి గానే కౌంటర్ ఇచ్చింది. చెయ్యని తప్పుకు ఎందుకు విమర్శలు పాలవ్వాలని అనుకున్న వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా బయటకు వస్తున్నారు. అందరూ యాక్టివ్ అయి చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
లడ్డూ వ్యవహారంపై చంద్రబాబు ఆరోపణలు చేయ్యకపోయి ఉంటే.. వైసీపీ నేతలు ఇప్పుడల్లా బయటకు వచ్చే వారు కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ వల్లే వైసీపీ నేతలు యాక్టివ్ అయ్యారని పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని రాజకీయంగా వాడుకొని టీడీపీఐ విమర్శలు చేసేందుకు దూరంగా ఉన్న వైసీపీ నేతలందరూ మీడియా ముందుకు వస్తున్నారు. కీలక నేతలు మీడియాలో కనిపిస్తూ.. ఉండటంతో ఆయా నియోజకవర్గాల క్యాడర్ లో నయా జోష్ కనిపిస్తోంది.
నిన్న మొన్నటి వరకు రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ మంత్రి కొడాలి నాని.. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ , రోజాలు ఇప్పుడు యాక్టివ్ అయ్యారు. వరుస పెట్టి విమర్శలు చేస్తున్నారు. టీడీపీ చేసే ఆరోపణలను తిప్పి కొడుతున్నారు. దీంతో వైసీపీ క్యాడర్లో కొంత ధైర్యాన్ని ఇచ్చే అంశంగా చెబుతున్నారు. మొత్తంగా చంద్రబాబు ఇచ్చిన స్టేట్మెంట్ వైసీపీకి ప్లస్ అయిందని విశ్లేషకులు అంటున్నారు.