వ్యూహం మార్చిన జగన్.? గురి తప్పదుగా.!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద కల్తీ విషయంలో గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వైసీపీ అధినేత వ్యూహం మార్చారు. ఇప్పటి వరకు నిజాలు తెలుసుకోవాలని ఆయన చాలా మందికి లేఖలు రాశారు. పార్టీ పరంగా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ లడ్డూలో కల్తీ జరగనే లేదు అన్న వాదన మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి.
అందుకోసం రకరకాల వాదనలతో తెరపైకి వస్తున్నాయి. తాజాగా జగన్ స్వయంగా రంగంలోకి దిగాలని నిర్ణయించారు. తిరుమలకు కాలి నడకన వెళ్లడంతో పాటు ఆలయాల్లో పూజలు చేయాలని పార్టీ క్యాడర్ కు పిలుపునిచ్చారు. తిరుమల లడ్డూ ఇష్యూలో జగన్ అన్యమతస్తుడు కాబట్టే హిందూ సంప్రదాయాలు, సనాతన ధర్మం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారనే పైగా కించ పరుస్తున్నారని ప్రజల్లొకి తీసుకెళ్తున్నారు. ఈ విషయంలో ఎదురు దాడికి వైసీపీ వ్యూహం సిద్ధం చేసుకుంది. చాలా రోజులు బయటకు రాని కొడాలి నాని వంటి వారిచేత ప్రెస్ మీట్లు పెట్టించారు. కల్తీ నెయ్యితో వచ్చిన ట్యాంకర్లను వెనక్కి పంపించామని కల్తీ జరగలేదని వాదించారు.
అందరూ ఇదే వాదనతో తెరపైకి వస్తున్నారు. శనివారం ఆలయాల్లో పూజలు, ఆ తర్వాత జగన్ తిరుమల పర్యటన తర్వాత మరింత అగ్రెసివ్ గా కల్తీ జరగలేదన్న వాదనలు వినిపించాలని కుంటున్నారు. మరోవైపు లడ్డూ నెయ్యి కల్తీ వ్యవహారంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తమిళనాడుకు చెందని ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇవ్వడానికి అనేక రూల్స్ మార్చారని తెలిసింది.
కనీస అర్హత లేకపోయినా. రూల్స్ మార్చి ఏఆర్ డెయిరీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. అలాగే ఆ డెయిరీ నెయ్యి కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన పరీక్షల్లోను కల్తీగా తేలింది. వీటన్నింటిని ఇప్పుడు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించారు. ఆ సిట్ నివేదికలో అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అసలు నెయ్యి టెండర్లు వెనుకు ఉన్న గోల్ మాల్.. ఆయా సంస్థలు నెయ్యిని ప్రోక్యూర్ చేస్తాయి. అసలు తిరుమలలో టెస్టింగ్ చేశారా లేదా వంటి విషయాలు అన్నీ బయట పడే ఛాన్స్ ఉంది.