చంద్రబాబు హా మజాకా..! టీటీడీ ప్రక్షాళన.. ఇక హిందువులకే ఉద్యోగాలు?
లడ్డూ వివాదం వేళ తిరుమలను పూర్తి స్థాయి ప్రక్షాళన చేసే దిశగా చంద్రబాబు సర్కారు ప్లాన్ చేసింది. సోమవారం టీటీడీలో ఉదయం ఆరు నుంచి శాంతి హోమం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అన్ని దేవాలయాల్లో వాడే వస్తువులు పరిశీలించాలని మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ మేరకు ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేసిన కూటమి నేతలు.. తిరుమలలో జరిగే అన్ని పనులు వేంకటేశ్వర స్వామికి తెలుసు అని వ్యాఖ్యానించారు. ఆయన్ను ఎవరు మలినం చేయలేరన్నారు. వేంకటేశ్వర స్వామి ఆయన్ను ఆయన కాపాడుకోగలరని వ్యాఖ్యలు చేశారు. టీటీడీని పూర్తి ప్రక్షాళన చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మూడు రోజులు యాగం చేశారు.
టీటీడీకి పూర్వ వైభవం తీసుకువస్తాం.. ఆగమ సలహా మీటింగ్ లో ఐజీ స్థాయి అధికారితో ఒక సిట్ నియమించాలని నిర్ణయం తీసుకున్నట్లు కూటమి నేతలు తెలిపారు. అలాగే లడ్డూ వ్యవహారంపై పూర్తి నివేదిక రాగానే బాధితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఏ మత ప్రార్థనా మందిరంలో ఆ మతం వాళ్లే ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
అవసరం అయితే దీనిపై చట్టం చేస్తామని.. అన్ని దేవాలయాల్లో కూడా మహిళలకు గౌరవం ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. మనో భావాలు దెబ్బతిన్న వారికి సూచన చేస్తున్నాం. టీటీడీప వ్యాపార కేంద్రంగా , రాజకీయ కేంద్రంగా మార్చారు. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూస్తామని తెలిపారు. గతంలో పింక్ డైమండ్ పై ఆరోపణలు కూడా చేశారు. దానిపై కేసు వేస్తే విత్ డ్రా చేసుకున్నారని ఈ సందర్భంగా కూటమి నేతలు గుర్తు చేశారు.
ఇక ఈ విషయంపై చంద్రబాబు మాట్లాడుతూ.. ఆగమ సలహాదారుల సూచన మేరకు శాంతి హోమం చేపడుతున్నామని తెలిపారు. పంచగవ్య ప్రోక్షణ చేస్తారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా.. గతంలో వైఎస్సార్ ఏడు కొండలు ఉండగా.. ఎందుకు రెండే చాలని అన్నప్పుడు నాడు నేను పోరాడాను అని చంద్రబాబు గుర్తు చేశారు. అలాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో ఐదేళ్లు అపవిత్ర కార్యక్రమాలు, రాజకీయ నాయకులు పునరావసం కల్పించారని ఆయన ఆరోపించారు.