జనసేనకి ఆ రోజు ఎంతో ప్రత్యేకం ! ఎందుకో తెలుసా?
జనసేన పుట్టాక ఎన్నో చేరికలు జరిగాయి. కానీ ఈ నెల 26న బలమైన నేతలుగా పేరొందిన వారు… వైసీపీలో దశాబ్ధాలుగా ఉంటూ వచ్చిన వారు .. జగన్ కి అత్యంత సన్నిహితులు.. దగ్గర బంధువులు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి.. జనసేనలో చేరబోతున్నారు. ఆ విధంగా జనసేనకి 26 స్పెషల్ డే అని చెప్పాలి.
ఏపీలో టీడీపీ వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీ. ఆ పార్టీకి పోటీగా ఇంత వరకు వైసీపీ ఉంది. ఇప్పుడు వైసీపీ ని దెబ్బ తీసే పనిలో టీడీపీ ఉంది. అలా జనసేనను ఎంచుకొని నాయకులు అంతా ఆ పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల 26న జనసేన కండువా దినోత్సవంగా చెబుతున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డితో పాటు, కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, అలాగే గుంటూరు జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య వంటి వారు జనసేన తీర్థం పుచ్చుకోబోతున్నారు.
దీంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమక్షంలో వీరి చేరికకు అన్ని ఏర్పాట్లు ఘనంగా సాగుతున్నాయి. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగే ఈ చేరికలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది అని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ ముగ్గురు కీలక నేతలు పవన్ తో వేర్వేరుగా మాట్లాడారు అని అంటున్నారు.
వీరే కాకుండా విజయనగరం జిల్లాలోని వైసీపీ యూత్ విభాగం జోనల్ ఇన్‌ఛార్జిలు, ప్రశాకం జిల్లాకు చెందిన రాష్ట్ర కార్యదర్శి, విజయవాడ, గుంటూరు, తిరుపతి కార్పొరేషన్లకు చెందని అనేక మంది కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరుతున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.
మొత్తానికి అయితే వైసీపీ నుంచి జనసేనలోకి వలసలు మొదలు అయ్యాయి. అయితే ఇది ఆరంభం మాత్రమే అని.. రానున్న రోజుల్లో చేరికలు భారీగా ఉంటాయని జనసేన నాయకులు చెబుతున్నారు. వైసీపీ ప్రముఖులతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు అంతా కూడా చేరతారు అని అంటున్నారు. మొత్తానికి జనసేన గేట్లు తెరిచేసింది. దీంతో వైసీపీకి కొత్త కష్టాలు మొదలైనట్లే అని విశ్లేషకులు అంటున్నారు.