దిల్లీ సీఎంగా ఆ ఫైర్ బ్రాండ్..!
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రేవాల్ తన పదవికి రాజీనామా చేస్తాను అని సంచలన ప్రకటన చేశారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. బీజేపీకి రాజకీయంగా అతి దెబ్బ కొట్టాలన్నదే కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్. ఆయన జైలు గోడల మధ్య అయిదన్నేరుళ్లుగా నలిగిపోయారు.
ఆయనకు బెయిల్ రావడం కూడా అతి కష్టమైంది. అయినా సరే ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయలేదు. బీజేపీ ఏది అయితే కోరుకుందో అది మాత్రం కేజ్రీవాల్ చేయలేదు. ఆయన పట్టుదలగానే వ్యవహరించారు. అయితే జైలు బెయిల్ మధ్య ఉన్న ఆయన మరింత కాలం సీఎం పోస్టులో కూర్చోవడం కంటే తనకు నమ్మకస్థలైన వారిని ఆ సీటులో కూర్చోపెట్టి ఎన్నికలు నాలుల నెలలు ముందుకు జరిపి బిగ్ పొలిటికల్ హిట్ కొట్టాలని చూస్తున్నారు.
నిజానికి చూస్తే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో దిల్లీ శాసన సభకు ఎన్నికలు ఉన్నాయి. దాన్ని ఈ నవంబరుకు జరిపితే అన్ని విధాలుగా కలిసి వస్తాయని చూస్తున్నారు. అదే సమయంలో జార్ఖండ్ కి మహారాష్ట్రకి ఎన్నికలు ఉన్నాయి. జాతీయ స్థాయిలో వాతావరణం కూడా ఇండియా కూటమికే అనుకూలంగా ఉంది.
దీంతో కేజ్రీవాల్ కూడా ఇప్పుడే ఎన్నికలు పెట్టించుకొని మరోసారి దిల్లీ పీఠం పట్టుకుంటే రాజకీయంగా బీజేపీపై పై చేయి సాధించవచ్చని భావిస్తున్నారు. దర్జాగా ఆ సీటులో కూర్చోవాలని చూస్తున్నారు. అలా బీజేపీ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నారు. ఇది బీజేపీ ఊహించని ప్లాన్ అంటున్నారు.
ఇదిలా ఉండగా దిల్లీ సీఎంగా ఆయన ఎవర్నీ ఎంపిక చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. అయితే ఒక మహిళ మంత్రి పేరు మాత్రం బాగా ప్రచారంలో ఉంది. ఆమె అతీషీ. కేజ్రీవాల్ జైలులో ఉన్న సమయంలో ఆమె ప్రభుత్వానికి సంబంధించి మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. పదునైన విమర్శలతో బీజేపీని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. పైగా ఆమె కేజ్రీవాల్ కి నమ్మకస్తురాలు. ఆమె చేతిలో కీలకమైన అయిదు శాఖలు ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. చూడాలి మరి ఏం జరుగుతుందో.