గ్రేటర్ లో పట్టుకోస్ం కేసీఆర్ ను ఫాలో అవుతున్న రేవంత్ రెడ్డి.. !

గ్రేటర్ హైదరాబాద్  పరిధిలో కాంగ్రెస్ ఎంత బలహీనంగా ఉందో ప్రత్యేకంగా  చెప్పాల్సిన పనిలేదు. గత రెండు సార్లు జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో రెండు, మూడు చోట్ల గెలిచేందుకే నానా తంటాలు పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడ ఉందో చెప్పలేకపోతున్నారు. కచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఒకప్పుడు బీఆర్ఎస్ కు ఉండేది. గ్రేటర్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కేసీఆర్ సిద్ధంగా ఉండేవారు.


తెలంగాణ ఏర్పాటుకు ముందు జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో అభ్యర్థులు లేక బీఆర్ఎస్ పోటీ చేయలేకపోయింది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారం చేజిక్కాక కేసీఆర్ భిన్నమైన ప్లాన్ తో బీఆర్ఎస్ ను బలోపేతం చేశారు. ఆ ప్లాన్ నే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ లో బలోపేతం చేసేందుకు వాడేస్తోంది.


అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ మొదట అక్రమ కట్టడాల పేరుతో సెటిలర్ల కాలనీలపై విరుచుకుపడ్డారు. అయితే విస్తృతంగా కాదు. భారీగా ప్రచారం వచ్చే ఒకటి, రెండు చోట్ల మాత్రమే కూల్చివేతలు చేపట్టారు. దీంతో అందరూ దారికొచ్చారు. ఇప్పుడు రేవంత్ కూడా హైడ్రా పేరుతో అదే హడావుడి చేస్తున్నారు. రేవంత్ అంతిమ లక్ష్యం ఏంటో ఆయనకు బాగా తెలుసు.


వాస్తవానికి సిటీ ప్రజలకు తాయిలాలు ఇచ్చినా పెద్దగా పట్టించుకోరు. భావోద్వేగ అంశం ముఖ్యం. అందుకే కేసీఆర్ తాను ఉన్నాననే భరోసా  వారికి సెటిలర్లకి కల్పించారు. ఈ మేరకు కొన్ని పరిణామాలను సృష్టించారు. దీంతో మెజార్టీ ఓటర్లు గులాబీ పార్టీ వైపు నడిచారు. ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యూహాత్మక తప్పిదంతో రేవంత్ కేసీఆర్ ప్లాన్ ను చాలా సింపుల్ గా అప్లై చేశారు.


అంతే కానీ అతి ప్రచారం తెచ్చుకోవాలని ఆశ పడటం లేదు. కౌశిక్ రెడ్డి, గాంధీ ఇష్యూలను రాజకీయ కోణంలో కాకుండా ప్రజలతో సంబంధం ఉన్న అంశంగా మార్చారు. ఇప్పటికీ బీఆర్ఎస్ ముఖ్య నేతలు రేవంత్ ని తక్కువగానే అంచనా వేస్తున్నారు. అందుకే ఇలాంటి వ్యూహాత్మక తప్పిదాలు జరుగుతున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: