ఉచితాలతో మునిగిన మంచు రాష్ట్రం! తర్వాత ఏపీయేనా?

కాదేదీ ఉచితం అని పెద్దలు చెబుతారు. అలా ఉచితంగా తీసుకుంటే అందులోను మజా ఏం ఉండదు. స్వేదం చిందించి దాని నుంచి పొందే ప్రతి  పైసా ఇచ్చే కిక్కే వేరప్పా. ప్రజలు కూడా కష్టించే స్వభావులే. కానీ రాజకీయం కోసం ఓట్ల కోసం నాయకులు పార్టీని వారిని ఇలా తయారు చేస్తున్నాయి. సోమరులుగా మారుస్తున్నారు. ప్రతీది ఉచితం అనే నినాదాన్ని తెచ్చి ఓట్ల పంట పండించుకుంటున్నారు.


ఈ రోజున ఉచితం  అంటే రుపు డబ్బు పెట్టినా దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఉచితాలకు మంగళం పాడాలని ఆర్థిక నిపుణులు ఎప్పటి నుంచో చెబుతున్నారు. కానీ ఈ దేశంలో రాజకీయ పార్టీలు వేలం పాట మాదిరిగా నీవు రెండు ఇస్తే నేను నాలుగు ఇస్తాను అని ఉచిత పథకాలను జనం ముందు పెట్టి రాజకీయ లబ్ధిని పొందుతున్నారు. ప్రజలకు ఏం పోయింది ఉచితంగా ఇస్తే ఎవరికైనా చేదా వారు కూడా ఆ వైపుగానే మొగ్గు చూపుతున్నారు.   


కానీ ఉచితాల వల్ల కలిగే భారీ ముప్పు ఏమిటో కళ్లకు కట్టినట్లుగా హిమచల్ ప్రదేశ్ ఇప్పుడు చాటి చెబుతోంది. ఈ రాష్ట్రం ఇప్పుడు కాంగ్రెస్ చేతుల్లో ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఉచిత హామీలన్నీ ప్రకటించింది.  దీంతో ఉచితాలు కాస్తా ఇప్పుడు మంచు రాష్ట్రం కొంప ముంచాయి. దీంతో ఆ రాష్ట్రం ఏమీ చేయలేక చేతులెత్తేసింది. హిమచల్ ప్రదేశ్ ఇప్పుడు పెను ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది.


ఇటీవల ఆ రాష్ట్ర సీఎం, మంత్రులు జీతం తీసుకోమని కొంత ఆర్థిక స్వాంతన కలిగించారు. ప్రస్తుతం హిమచల్ ప్రదేశ్ లో పాత పింఛన్, ప్రతి నెలకు రూ.1500, యాభై శాతం రాయితీతో బస్సుల్లో ప్రయాణించే అవకాశాన్ని కల్పించారు. దీనికి తోడు ఉచిత విద్యుత్తు పథకాన్ని అమలు చేస్తున్నారు.


పాపం చిన్న రాష్ట్రం ఈ దెబ్బకు కుదేల్ అవుతోంది. హిమచల్‌ రాష్ట్రానికి ఏకంగా రూ.95 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. ఇక ఏటా ఆ రాష్ట్ర బడ్జెట్ రూ.58వేల కోట్లే. ఇందులో అచ్చంగా జీతాలకు, పెన్షన్లకు రూ.42 వేల కోట్లు పోతోంది. మిగిలిన 16 వేల కోట్లలో అప్పులకు వడ్డీలు కట్టడానికే సరిపోవడం లేదు. మరి అభివృద్ధి అన్నది నిలువెత్తు ప్రశ్న. ఇక ఏపీకి కూడా పది లక్షలక కోట్ల పైచిలుకు అప్పు ఉంది. హిమచల్ నుంచి పాఠాలు నేర్వకపోతే మన పరిస్థితి కూడా ఆలోచించాల్సిందే.


 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: