కేంద్రమంత్రిగా నాగబాబు?
వైసీపీ నుంచి నెగ్గిన ఇద్దరు రాజ్యసభ సభ్యులు తమ పదవులు వదులుకున్నవారు. వారే మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు. ఈ ఇద్దరూ గురువారం తమ పదవులకు రాజీనామా చేస్తూ రాజ్యసభ ఛైర్మన్ జగధీప్ ధన్ ఖడ్ కు స్వయంగా లేఖలను సమర్పించారు. ఈ ఇద్దరూ త్వరలో టీడీపీలో చేరతారు అనే ప్రచారం సాగుతోంది.
ఇక మీద మస్తాన్ రావు తొలి నుంచి టీడీపీ వారే. ఆయన మధ్యలో వైసీపీలోకి వెళ్లారు. ఇప్పుడు ఆయన తిరిగి తన మాతృసంస్థలోకి వచ్చారు. ఆయనకు తగిన న్యాయం చేస్తానని పార్టీ నుంచి హామీ లభించింది. దీంతో ఆయన రాజ్యసభ స్థానం ఖాళీ అయినట్లే. 2028 జూన్ 21 వరకు ఆయన పదవీ కాలం ఉంది. అంటే నాలుగేళ్లు అన్నమాట.
ఇక మోపిదేవి వెంకట రమణ తన సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఆయనకు టీడీపీ నుంచి ఎమ్మెల్సీ ఆఫర్ ఉందని తెలుస్తోంది. అలాగే ఆయన కుమారుడికి భవిష్యత్తు బాధ్యతకు గ్యారంటీ దక్కిందనే అంటున్నారు. మోపిదేవి రాజ్యసభ పదవీ కాలం జూన్ 21 2026 వరకు ఉంది. అంటే రెండేళ్ల కాల పరిమితి అన్నమాట.
ఈ రెండు పోస్టులు ఖాళీ అయినట్లు తొందర్లోనే ప్రకటన రానుంది. వీటికోసం కూటమి లోని చాలా మంది ఆశావహులు ఎదురు చూస్తున్నారు. అయితే చంద్రబాబు చూపు మాత్రం మాజీ ఎంపీ గల్లా జయదేవ్ మీద ఉందని అంటున్నారు. ఆయన గతంలో గుంటూరు నుంచి రెండు సార్లు ఎంపీగా గెలుపొందారు. ఇటీవల ఎన్నికల ముందు పోటీ నుంచి తప్పుకున్నారు.
ఇక మరో ఎంపీ సీటును జనసేనకి ఇస్తారనే ప్రచారం సాగుతోంది. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకి ఆ పోస్ట్ దక్కనున్నట్లు తెలుస్తోంది. నాగాబాబు 2019 లో జనసేన తరఫున అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి భారీ ఓట్లను తెచ్చుకున్నారు. కానీ ఓటమి పాలయ్యారు. ఈ సారి కూడా అనకాపల్లి నుంచి పోటీ చేయాలని భావించిన మిత్ర ధర్మం ప్రకారం ఆ సీటు బీజేపీ కి వెళ్లింది. దీంతో నాడు నాగబాబు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా నేడు ఆయనకు రాజ్యసభ ఇస్తారనే ప్రచారం నడుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర సహాయ మంత్రి కూడా ఇస్తారని అంటున్నారు. చూడాలి ఏం జరుగుతుందో.