భారత్‌కు వీఐపీ ట్రీట్‌మెంట్ ఇస్తున్న అమెరికా.. దటీజ్ ఇండియా?
ఈ క్రమంలోనే సుందర్ పిచాయ్ లాంటి వారు ప్రముఖ సంస్థలకు సీఈవోలుగా ఎదిగారు. అందుకే భారత్ కూడా వాణిజ్య, శాస్త్ర, సాంకేతిక, సైనిక పరంగా సహకారం కోరుకుంటోంది. దీంతో దశాబ్దాలుగా అధ్యక్షులు, ప్రధానులతో సంబంధం లేకుండా మైత్రి కొనసాగుతోంది.
ఈ క్రమంలో అమెరికా కాంగ్రెస్ లో భారత్ తో సైనిక సహకారాన్ని పెంపొందించుకోవాల్సిన అవసరాన్ని అమెరికా తాజాగా నొక్కి చెప్పింది. ఈ మేరకు ఆ దేశ కాంగ్రెస్ లో కీలక బిల్లు పెట్టారు. కాంగ్రెస్ లో కీలక సభ్యుడు మార్కో రూబియా ఈ బిల్లును ప్రవేశ పెట్టారు. అమెరికా మిత్ర దేశాలపై జపాన్, ఇజ్రాయెల్, దక్షిణ కొరియా, నాటో కూటమితో సమానంగా భారత్ ను చూడాల్సిన అవసరం ఉందని ఆ బిల్లులో పేర్కొన్నారు.
సాంకేతిక బదిలీ, ఆయుధాల సహకారంలో భారత్ కు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆ బిల్లులో ప్రతిపాదించారు. భారత దేశ సమగ్రతకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని గుర్తు చేశారు. దీనిని ఎగదోస్తున్నట్లు తేలితే పాకిస్థాన్ కు భద్రతా సాయం నిషేధించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే కాంగ్రెస్ లో ప్రవేశ పెట్టిన బిల్లులో పాకిస్థాన్ తో పాటు చైనా గురించి కూడా ప్రస్తావించారు. ఇండో-ఫసిపిక్ ప్రాంతంలో చైనా దురాక్రమణ పూరిత వైఖరి అనుసరిస్తోందని బిల్లులో అమెరికా పేర్కొంది. ఆ ప్రాంతంలో అమెరికా మిత్ర దేశాల సార్వభౌమాదికారానికి చైనా సవల్ విసురుతోందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇదిలా ఉండగా చైనాకు చెక్ పెట్టాలంటే భారత్ ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అమెరికా భావించింది. అందుకే ఇజ్రాయెల్, జపాన్, నాటో దేశాలతో పాటు సమానంగా మన దేశాన్ని గుర్తిస్తోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.