పవన్‌ కల్యాణ్‌.. పేరుకే ఉపముఖ్యమంత్రా?

మనం తరచూ వింటూ ఉంటాం. ఉప ముఖ్యమంత్రి, ఉప ప్రధాన మంత్రి అన్నపదవుల గురించి. నిజానికి వీటికి ఉన్న ప్రాముఖ్యం అంతా రాజకీయ పరమైనదే తప్ప రాజ్యాంగబద్ధమైన ప్రాతిపదిక ఈ పదవులకు లేదు అన్నది వాస్తవం. మన రాజ్యాంగం లో ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి పదవులను మాత్రమే నిర్దేశించింది.  ఈ రెండు పదవులు తప్ప మిగిలిన వారంతా మంత్రుల కిందికే వస్తారు. ఇదంతా ఎందుకు అంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది. దాంతో ఈ పదవి ప్రాముఖ్యం గురించి ఇప్పుడు అంతటా చర్చిస్తున్నారు.

అయితే ఉప ముఖ్యమంత్రి అని ప్రత్యేక గుర్తింపు అన్నది రాజ్యంగం ప్రకారం లేదు. అందుకే పవన్ కల్యాణ్ మంత్రిగానే ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఏదైనా ప్రభుత్వంలో మంత్రి కంటే స్థాయి పెంచి ఉన్నత పదవి వారికి ఇవ్వాలనుకుంటే ఉప ముఖ్యమంత్రి పదవిని సృష్టిస్తారు.
అయితే ఇది పాలనాపరంగా సౌలభ్యంతో పాటు రాజకీయంగా ఎక్కువ గుర్తింపు కోసమే తప్ప ఉప ముఖ్యమంత్రికి ప్రత్యేక అధికారాలు అంటూ ఏమీ ఉండవు అని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. వారు కూడా మంత్రుల మాదిరిగానే ఉంటారని పేర్కొంటున్నారు.  

మరోవైపు చూస్తే ఉప ముఖ్యమంత్రులుగా ఇప్పటి వరకు ఎవరు అంటే 2014లో విభజన ఏపీలో కేఈ కృష్ణమూర్తి, నిమ్మకాయల చినరాజపప్ లు ఉప ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఇక 2019లో పాలన చేపట్టిన సీఎం జగన్ హయాంలో ఈ లిస్ట్ కొంచెం పెద్దగానే ఉంటుంది. ఏకంగా సామాజిక వర్గానికి ఒకరు చొప్పున ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కట్టబెట్టి అప్పట్లో సంచలనం సృష్టించారు.

అయితే ప్రస్తుతం పవన్ కి డిప్యూటీ సీఎం ఇవ్వడం వెనుక ప్రత్యేక వ్యూహమే ఉంది. ఏపీలో అధికారంలోకి రావడానికి, కూటమి ఏర్పడానికి పవన్ పాత్ర కీలకం. అందుకే ఆయన గౌరవాన్ని తగ్గించకుండా.. మిగతా మంత్రులతో సమానం కాకుండా ఉండేందుకు చంద్రబాబు ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని అప్పజెప్పారు. అందుకే మిగతా మరెవరికీ ఈ పదవిని కేటాయించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: