అమెరికాను వణికిస్తున్న సౌదీ అరేబియా కీలక నిర్ణయం?

1972 లో అమెరికా సౌదీ అరేబియాల మధ్య పెట్రో డాలర్ ఒప్పందం కుదిరింది.  నేటితో ఆ ఒప్పంద గడువు తీరిపోయింది. దీని ప్రకారం క్రూడ్ ఆయిల్ ని అమ్మడానికి, కొనడానికి కేవలం అమెరికన్ డాలర్ ని మాత్రమే ఉపయోగించాలి. అయితే దీనివల్ల ఎక్కువగా లాభ పడ్డది సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, కువైట్ దేశాలు మాత్రమే. అంతర్జాతీయంగా డాలర్ ఆధిపత్యానికి తెర తీసింది అనుకోవచ్చు.

అయితే 50 ఏళ్ల పాటు  అమలలో ఉన్న పెట్రో డాలర్ ఒప్పందం గురువారంతో ముగిసింది. ప్రస్తుతం సౌదీ అరేబియా రాజు పెట్రో డాలర్ ఒప్పందాన్ని పొడిగించే ఉద్దేశంలో లేరు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో సౌదీ రాజుకి ఉన్న అభిప్రాయ భేదాల వల్ల ఈ ఒప్పందం గడువు పెంచే అవకాశం లేదు. ఇక నుంచి సౌదీ అరేబియా తన క్రూడ్ ఆయిల్ ని జపాన్ యెన్, చైనా ఆర్ఎంబీ, ఈయూ యూరోలతో లావాదేవీలు జరపబోతోంది.

క్రూడ్ ఆయిల్ మీద అమెరికా డాలర్ ఆధిపత్యం పోవడం వల్ల ఆ దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికాలో ద్రవ్యోల్భణం పెరిగి అన్ని ధరలు పెరగవచ్చు. డీ డాలరైజేషన్ ప్రక్రియ ఇప్పటికే దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతుంది. ఒపెక్ దేశాలు ఇప్పటికే చైనా యువాన్ తో వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. అందుకే చైనా తన డాలర్ రిజర్వ్ ని తగ్గించే క్రమంలో అమెరికన్ ట్రెజరీ లో ఉన్న పెట్టుబడులు క్రమంగా అమ్మేస్తుంది.

అమెరికా డాలర్ కి బదులు బంగారం ఇస్తోంది. చైనాకి అమెరికాకి ఈ విషయంలో వివాదం మొదలయ్యే అవకాశం ఉంది. డాలర్ కి బదులు ఎలాంటి ప్రత్యామ్నాయం లేదు. మన కరెన్సీ నోట్ల మీద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గ్యారంటీ ఉంటుంది. అంటే రూపాయి చెల్లకపోతే ఆ విలువకి బంగారం ఇస్తుంది. కానీ డాలర్ కి అలాంటి గ్యారంటీ అంటూ ఏమీ ఉండదు. దాదాపు 3 ట్రిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్స్ లో చైనా పెట్టుబడులు ఉన్నాయి. డాలర్ విలువ పడిపోకముందే ట్రెజరీ బాండ్స్ ని  చైనా ఉపసంహరించుకొనిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

usa

సంబంధిత వార్తలు: